మోడీ సంపాదన పెరిగింది….అమిత్ షా ఆస్తి తగ్గింది

  • Published By: venkaiahnaidu ,Published On : October 15, 2020 / 05:33 PM IST
మోడీ సంపాదన పెరిగింది….అమిత్ షా ఆస్తి తగ్గింది

Modi assets: గతేడాదితో పోల్చుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంపాదన కొంత పెరిగింది. ఈ ఏడాది జూన్ నాటికి మోడీ సంపాదన రూ.2.85 కోట్లుగా తేలింది. గతేడాదితో పోలిస్తే రూ.36 లక్షలు(బ్యాంకు డిపాజిట్లు రూ. 3.3లక్షలు, పెట్టుబడుల రిటర్న్స్ రూ.33 లక్షలు) మోడీ సంపాదన పెరిగింది. గతేడాది మోడీ సంపాదన రూ.2.49 కోట్లు. ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించిన ఆస్తుల ప్రకటనతో మోడీ సంపాదన గురించి తెలిసింది.



ఈ ఏడాది జూన్ చివరాఖరుకు మోడీ దగ్గర నగదు రూపంలో రూ.31,450 ఉందని, ఆయన బ్యాంకు బ్యాలెన్స్ రూ.3,38,173గా ఉన్నట్లు పీఎంవో వెల్లడించింది. గాంధీనగర్ లోని ఎస్ బీఐ బ్రాంక్ లో ఈ నగదు ఉన్నట్లు తెలిపింది. అదే బ్యాంకులో మోడీకి రూ. 1,60,28,939 రూపాయల FDR, MOD ఉన్నట్లు పీఎంవో తెలిపింది. రూ.8,43,124 విలువైన NSC(National Savings Certificates), రూ.1,50,975 విలువైన లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు, రూ.20,000విలువైన ట్యాక్స్-సేవింగ్ ఇన్ఫ్రా బాండ్లు ఉన్నట్లు తెలిపింది. 1.75కోట్ల మూవబుల్ అసెట్స్ మోడీ పెరు మీద ఉన్నట్లు తెలిపింది.

మోడీ ఎలాంటి లోన్లు తీసుకోకపోగా, ఆయన పేరు మీద ఓ సొంతవాహనం కూడా లేదు. మోడీ దగ్గర నాలుగు గోల్డ్ రింగ్స్ ఉన్నాయి. వాటి బరువు 45 గ్రాములు, విలువ సుమారు రూ. 1.5 లక్షలు. ఇక గుజ‌రాత్ లోని గాంధీన‌గ‌ర్ లోని సెక్టార్-1లో తనకు 3,531 స్క్వేర్ ఫీట్‌‌ల సొంత ప్లాట్ ఉందని, ఈ ప్లాట్‌‌ మరో ముగ్గురు జాయింట్ ఓనర్స్‌‌ ఉన్నారని, ప్లాట్‌‌ లో ప్రతి ఒక్కరికి 25 శాతం చొప్పున షేర్ వస్తుందని పీఎంవోకు సమర్పించిన డిక్లరేషన్‌‌‌లో మోడీ పేర్కొన్నారు.


మరోవైపు, మోడీ తర్వాత కేంద్రప్రభుత్వంలో నెం.2గా ఉన్న హోం మంత్రి అమిత్ షా ఆస్తి 2019లో రూ.32.3 కోట్లు ఉండగా, ఈ ఏడాది జూన్ నాటికి రూ.28.63కోట్లకు తగ్గినట్టుగా డిక్లరేషన్ లో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సహా సీనియర్ మంత్రులందరూ తమ సంపదలను వెల్లడించారు. రామ్‌దాస్ అథవాలే, బాబుల్ సుప్రియో, ప్రతాప్ చంద్ర సారంగి సహా కొందరు జూనియర్ మంత్రులు తమ డిక్లరేషన్లను ఇంకా దాఖలు చేయలేదు.