Budget Session 2023: ప్రపంచం మొత్తం భారతదేశ బడ్జెట్‌‌ను చూస్తోంది.. ప్రధాని మోదీ

పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన మోదీ. పార్లమెంట్ భవన్ వద్ద మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచం మొత్తం భారతదేశం బడ్జెట్ వైపు చూస్తోందని అన్నారు. అందరి ఆకాంక్షలు నెరవేర్చేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని భావిస్తున్నా. ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్‌ను ముందుకు తీసుకువెళతాం. అన్ని అంశాలపై సభలో చర్చ జరగాలని కోరుకుంటున్నానని ప్రధాని అన్నారు.

Budget Session 2023: ప్రపంచం మొత్తం భారతదేశ బడ్జెట్‌‌ను చూస్తోంది.. ప్రధాని మోదీ

PM Modi

Budget Session 2023: బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ సమావేశం హాల్ లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. పార్లమెంట్ లో తొలి ప్రసంగం చేసిన ఆమె ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనందంగా ఉందని అన్నారు. పౌరులందరి అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, ఆమేరకు ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అయితే, బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన మోదీ. పార్లమెంట్ భవనం ఆవరణంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచం మొత్తం భారతదేశం బడ్జెట్ వైపు చూస్తోందని అన్నారు.

Parliament Session: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. మెనూలో ప్రత్యేక వంటకాలు ..

ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. దేశ రాష్ట్రపతి తొలిసారిగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆమె ప్రసంగం భారత రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థకు గర్వకారణం. మహిళలను గౌరవించే అవకాశం కూడా అని ప్రధాని మోదీ అన్నారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే గొప్ప గిరిజన సంప్రదాయాన్ని గౌరవించుకోవడానికి కూడా ఇదొక అవకాశం అని ప్రధాని అన్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టే ఆర్థిక మంత్రికూడా మహిళే అని అన్నారు. భారత ప్రజానీకమే కాకుండా ప్రపంచం మొత్తం పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ వైపు చూస్తోందని ప్రధాని అన్నారు.

 

దేశంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా బడ్జెట్ రూపొందించారని భావిస్తున్నానని మోదీ అన్నారు. ఇండియా ఫస్ట్, సిటిజన్ ఫస్ట్‌ అనే ఆలోచనతో ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ముందుకు తీసుకెళ్తామని మోదీ అన్నారు. ప్రతిపక్ష నేతలు తమ అభిప్రాయాలను పార్లమెంట్ వేదికగా తెలియజేస్తారని ఆశిస్తున్నానని అన్నారు.