లిట్టి తిని, మట్టికప్పులో ఛాయ్ తాగి….ఢిల్లీ ఎగ్జిబిషన్ కు మోడీ సర్ ప్రైజ్ విజిట్

  • Published By: venkaiahnaidu ,Published On : February 19, 2020 / 11:32 AM IST
లిట్టి తిని, మట్టికప్పులో ఛాయ్ తాగి….ఢిల్లీ ఎగ్జిబిషన్ కు  మోడీ సర్ ప్రైజ్ విజిట్

ఢిల్లీ ఎగ్జిబిషన్ లో ప్రధానమంత్రి నేరంద్ర మోడీ సందడి చేశారు. బీహార్,తూర్పు ఉత్తరప్రదేశ్ లో ఫేమస్ వంటకం “లిట్టి-చోకా” టెస్ట్ చేశారు.

బుధవారం(ఫిబ్రవరి-18,2020)మధ్యాహ్నాం ఢిల్లీలోని రాజ్ పథ్ లో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్వహిస్తున్న క్రాఫ్ట్ ఫెస్ట్ “హునార్ హాత్”ఎగ్జిబిషన్‌ లో ప్రధాని మోదీ సందడి చేశారు.

కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే నేరుగా అక్కడికి వెళ్లిన ప్రధాని…స్థానికులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎగ్జిబిషన్‌లో హస్త కళల స్టాల్స్‌ని సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు. అనంతరం లిట్టి చోకా తిని మట్టి కప్పులో చాయ్ తాగారు. లిట్టి చోకా తిన్నందుకు రూ.120 చెల్లించారు మోడీ. అనంతరం కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీతో కలిసి మట్టి గ్లాసుల్లో టీ తాగారు. ఇద్దరి ఛాయ్ డబ్బులు రూ.40 మోడీనే చెల్లించారు. ఢిల్లీ క్రాఫ్ట్స్ ఫెస్ట్‌లో సుమారు 50 నిమిషాల పాటు ఉన్నారు మోడీ. అన్ని స్టాల్స్ తిరిగి అక్కడున్న వస్తువులను వీక్షించారు. 

‘కౌషల్ కో కామ్’ థీమ్ ఆధారంగా ఫిబ్రవరి 23 వరకు హునార్ హాత్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా 50 శాతం మందికిపైగా మహిళలతో సహా మాస్టర్ కళాకారులు, హస్తకళాకారులు మరియు పాక నిపుణులు హునార్ హాత్ లో పాల్గొంటున్నారు . ప్రజలు ఆస్వాదించడానికి అందుబాటులో ఉన్న అనేక రాష్ట్రాల సాంప్రదాయ రుచికరమైన పదార్ధాలతో ‘బావార్చిఖానా’ సెక్షన్ ఏర్పాటు చేశారు. మాస్టర్ హస్తకళాకారులను శక్తివంతం చేసే ప్రయత్నంలో భాగంగా భారతదేశం అంతటా ఇలాంటి ‘హాత్’ లు నిర్వహిస్తున్నారు.

	modi2-.jpg

 

	modi1.jpg

 

	modi3.jpg

 

#WATCH Prime Minister Narendra Modi today visited Hunar Haat at India Gate, where artisans and craftsmen from various parts of the country are participating. #Delhi pic.twitter.com/JmWZnboyBR