ప్రాణయామం చేయండి..ఆరోగ్యంగా ఉండండి – మోడీ పిలుపు

  • Published By: madhu ,Published On : June 21, 2020 / 01:48 AM IST
ప్రాణయామం చేయండి..ఆరోగ్యంగా ఉండండి – మోడీ పిలుపు

ప్రతి రోజు..ప్రతొక్కరూ..ప్రాణయామం చేయాలని..ఆరోగ్యంగా ఉండాలని..దీనిని చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. మానసిక ఒత్తిడి, రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో ఇంట్లోనే యోగా..ఫ్యామిలతో యోగా పిలుపునివ్వడం జరిగిందన్నారు. 

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా..2020, జూన్ 21వ తేదీ ఆదివారం ఉదయం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో డిజిటల్ మీడియా ద్వారా మాట్లాడారు. ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉండి..కుటుంబసభ్యులతో యోగా చేయాలని మరోసారి పిలుపునిచ్చారు. కుటుంబంతో యోగా చేయడం వల్ల..ఎన్నో సత్ఫలితాలు ఇస్తుందన్నారు. రోగ నిరోధక శక్తి కరెక్టుగా ఉంటే..కరోనాను దూరం చేయవచ్చని, ఇందుకు యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయన్నారు.

ప్రాణమాయం ఇందుకు చక్కటి పరిష్కారమని, ప్రతి రోజు దీనిని చేయడం వల్ల..ఎన్నో లాభాలు కలుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వామి వివేకానంద చెప్పిన అంశాలను ప్రధాని ప్రస్తావించారు. యోగా కేవలం..ఒక్క రోజు మాత్రమే చేయవద్దని, రోజులో భాగం చేయాలని మోడీ సూచించారు. 

Read: జీరో కరోనా జోన్ గా లక్షద్వీప్.. ఎలా సాధ్యమైంది?