#UnionBudget 2023 : బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంది..ఎన్నో ప్రోత్సాహాలు ప్రకటించాం : ప్రధాని మోడీ

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాని మోడీ మాట్లాడుతూ..ఇది అన్ని వర్గాలకు అనుకూలమైన బడ్జెట్ అని అన్నారు.

#UnionBudget 2023 : బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంది..ఎన్నో ప్రోత్సాహాలు ప్రకటించాం : ప్రధాని మోడీ

pm modi spoke about the UnionBudget 2023

#UnionBudget 2023 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాని మోడీ మాట్లాడుతూ..ఇది అన్ని వర్గాలకు అనుకూలమైన బడ్జెట్ అని అన్నారు. ఈ బడ్జెట్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వికాసానానికి తోడ్పాటునిస్తుందన్నారు. బడ్జెట్ లో మహిళా సాధారత దిశగా కేటాయింపులు జరిగాయన్నారు. దీంట్లో శ్రీ అన్న పథకం అద్భుతమైనది అంటూ ప్రశంసించారు.

ఏడు అంశాలు ప్రాధాన్యంగా రూపొందించిన బడ్జెట్ కొత్త ఇండియాకు గట్టి పునాది అవుతుందన్నారు. 2047 లక్ష్యంగా పథకాలు రూపొందించిన ఈ బడ్జెట్ అన్ని వర్గాల కలలను సాకారం చేస్తుందని..పీఎం విశ్వకర్మ ప్రోత్సాహకాన్ని ప్రకటించామని అన్నారు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు మరో ఏడాది పొడిగించామని..ఈ ప్రోత్సాహంతో ఆయా రాష్ట్రాలు అభివృద్ధి చెందేందుకు తోడ్పాటునందిస్తుందన్నారు.దీని కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయించామని అన్నారు.

కాగా..శ్రీ అన్న పథకం కోసం హైదరాబాద్ కేంద్రంగా రీసెర్చ్‌లు జరపుతామని బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని కోసం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్‌ను ఎక్స‌లెన్స్‌గా మార్చనున్నామని ప్రకటించారు. జోవర్, రాగి, బజ్రా, రామదానా, చీనా, సామా వంటి పోషక పదార్ధాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఇతర విషయాలపై ఈ సంస్థ పరిశోధనలు చేస్తుందని తెలిపారు.