పాక్ కు మోడీ వార్నింగ్ : మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్

  • Published By: venkaiahnaidu ,Published On : February 18, 2019 / 11:13 AM IST
పాక్ కు మోడీ వార్నింగ్ : మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్

పాక్ తో చర్చల సమయయం ముగిసిపోయిందని, ఇప్పుడు చర్యలు తీసుకొనే సమయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. చర్చలకు సమయం ముగిసిపోయిందనే విషయం పుల్వమా జిల్లాలో జరిగిన ఉగ్రదాడితో నిరూపితమైందన్నారు.పాక్ తో చర్చలు జరిపే సమయం ముగిసిపోయిందని సూచిందన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి తర్వాత పాక్ ను ప్రధాని హెచ్చరిండం ఇది నాలుగోసారి. సోమవారం(ఫిబ్రవరి-18,2019) ఢిల్లీలో మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న అర్జెంటీనా ప్రెసిడెంట్  మౌరికియో మాక్రితో చర్చల అనంతరం మోడీ మాట్లాడుతూ..ఉగ్రవాదంపై పోరుకు భారత్-అర్జెంటీనాలు ప్రత్యేక డిక్లరేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు.

ఉగ్రవాదంపై పోరుకి అన్ని దేశాలు కలిసిరావాలని మోడీ కోరారు. ఉగ్రవాదులకు, వారి మద్దతుదారులపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని మోడీ అన్నారు. G-20లో భాగంగా ఉన్న భారత్ హంబర్గ్ లీడర్ల ప్రకటనపై 11పాయింట్ల అజెండాను అమలుచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ఉగ్రవాదం పెద్ద ముప్పు అని తాను, అర్జెంటీనా ప్రెసిడెంట్ అంగీకరించామని మోడీ తెలిపారు.

ఈ సందర్భంగా అర్జెంటీనా ప్రెసిడెంట్  మౌరికియో మాక్రి పుల్వామా భాధితులకు సంతాపం తెలిపారు. ఉగ్రదాడులను తాము తీవ్రంగా ఖండిస్తామని తెలిపారు

Read Also : గ్లోబల్ ట్రెండ్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ కు బాలయ్య డైలాగ్ వార్నింగ్స్

Read Also : ఇండియా ఎఫెక్ట్ : పాక్‌లో భగ్గుమన్న టీ ధరలు