PM Modi: సిక్కు గురు 400వ జయంతి.. ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగం

ప్రముఖ సిక్కు గురువు తేహ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా నిర్వహించే పర్కాష్ పురాబ్‌ను పురస్కరించుకుని ఈ నెల 21న Pm Modi జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

PM Modi: సిక్కు గురు 400వ జయంతి.. ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగం

Pm Modi

PM MODI: ప్రముఖ సిక్కు గురువు తేహ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా నిర్వహించే పర్కాష్ పురాబ్‌ను పురస్కరించుకుని ఈ నెల 21న ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఎర్రకోట నుంచి గురువారం ఆయన ప్రసంగం సాగుతుందని దేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, తేహ్ బహదూర్ స్మారక నాణాన్ని విడుదల చేస్తారు.

PM Modi : గుజరాత్‌లో ఈరోజు నుంచే ప్రధాని మోదీ 3 రోజుల పర్యటన.. WHO చీఫ్ టెడ్రొస్ కూడా..

400 మంది సిక్కు సంగీతకారులు (రాగిస్) ‘షాబాద్ కీర్తన’లు ఆలపిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఢిల్లీ సిక్కు గురుద్వార మేనేజ్‌మెంట్ కమిటీతో కలిపి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక శాఖ తెలిపింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా జరగనున్న ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు పాల్గొంటారు.