PM Modi in Europe: యూరోప్‌లో భారత ప్రధాని: 65 గంటల్లో 25 కీలక సమావేశాల్లో పాల్గొననున్న మోదీ

మూడు రోజుల పాటు పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. మొత్తం మూడు రోజుల వ్యవధిలో 65 గంటల పాటు 25 కీలక సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.

PM Modi in Europe: యూరోప్‌లో భారత ప్రధాని: 65 గంటల్లో 25 కీలక సమావేశాల్లో పాల్గొననున్న మోదీ

Modi Ji

PM Modi in Europe: భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్ పర్యటన నిమిత్తం సోమవారం జర్మనీలోని బెర్లిన్ చేరుకున్నారు. జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో మూడు రోజుల పాటు పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. మొత్తం మూడు రోజుల వ్యవధిలో 65 గంటల పాటు 25 కీలక సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కాల్జ్ ఆహ్వానం మేరకు ముందుగా జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ..ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. జర్మనీ విచ్చేసిన ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. అంతర్జాతీయంగా ఈ ఏడాది ప్రధాని మోదీ పర్యటన ఇది. రష్యా – యుక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యాకు వ్యతిరేకంగా యూరోప్ మొత్తం ఏకం కాగా, ఆయా భాగస్వామ్య దేశాల్లోనే నేడు మోదీ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also read:Chandrababu Naidu: రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్ రేట్ పై డీజీపీకి లేఖ రాసిన మాజీ సీఎం చంద్రబాబు

బెర్లిన్‌లో తన పర్యటన వైస్-ఛాన్సలర్ మరియు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఓలాఫ్ స్కాల్జ్ తో గత సంవత్సరం G20 సమావేశంలో మాటామంతి కలిపారు ప్రధాని మోదీ. ఈక్రమ్మలోనే నేడు ఓలాఫ్ తో వివరణాత్మక ద్వైపాక్షిక చర్చలు నిర్వహించడానికి అవకాశం కల్పిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. జర్మనీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్ సెంటర్ (IGC)తో జత కలవడం ఇరుదేశాల మధ్యస్థ మరియు దీర్ఘకాలిక ప్రాధాన్యతలను అర్ధం చేసుకోవడానికి ఉపకరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

Also read:Vaccination: ఒక్కరికీ వ్యాక్సిన్ బలవంతంగా వేయడానికి లేదు – సుప్రీం కోర్టు

2000 నుండి వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్న భారత్, జర్మనీ.. 2021 నాటికి దౌత్య సంబంధాలు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాలు వేడుకలు నిర్వహించాయి. పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య వ్యాపార రంగాలకు ఊతమిచ్చేలా రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇది రెండు దేశాలలో కోవిడ్ అనంతర ఆర్థిక పునరుద్ధరణను బలోపేతం చేయడంలో సహాయపడనుంది. జర్మనీ నుంచి డెన్మార్, అనంతరం తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్ దేశాధినేతలను ప్రధాని మోదీ కలువనున్నారు.

Also Read:Prashant Kishor: ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్: సొంత పార్టీ పెట్టనున్నట్లు ఊహాగానాలు