శత్రువులకు గుబులే : సైన్యం చేతిలో శత్రు భీకర అర్జున్ ట్యాంక్, జాతికి అంకితం

శత్రువులకు గుబులే : సైన్యం చేతిలో శత్రు భీకర అర్జున్ ట్యాంక్, జాతికి అంకితం

pm modi to dedicate arjun tank : అర్జున్ ట్యాంక్‌ తాజా వెర్షన్‌ మార్క్‌1ఏను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని అవడి ట్యాంకు తయారీ కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. భారత ఆర్మీ, డీఆర్డీవో కలిసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అర్జున్‌ ట్యాంక్‌ను అభివృద్ధి చేశాయి. డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి తొలి అర్జున్‌ మార్క్‌1ఏ ట్యాంకును ప్రధానికి అందజేశారు. అనంతరం ఈ ట్యాంకును మోదీ జాతికి అంకితమిచ్చారు. అర్జున్ ట్యాంకు కొత్త వెర్షన్‌లో ఇండియన్‌ ఆర్మీ, డీఆర్డీవో ఏకంగా 71 మార్పులు చేసింది.

తొలి బ్యాచ్‌ కింద 124 ట్యాంకులను ఆర్మీకి అప్పగించగా పాకిస్థాన్‌ సరిహద్దులో వీటిని మోహరించారు. తాజాగా మరో 124 కొత్త వెర్షన్‌ ట్యాంకులకు రక్షణ శాఖ ఆర్డర్‌ ఇచ్చింది. అయితే ఈ సంఖ్యను 118కు కుదించారు. మార్క్‌1ఏ ట్యాంకులను కూడా పాకిస్థాన్‌ సరిహద్దులో మోహరిస్తారు. 8 వేల 400 కోట్ల విలువైన 118 అర్జున్‌ మార్క్‌1ఏ ట్యాంకులను ఆర్మీలో ప్రవేశపెట్టాలని ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి తొలి అర్జున్‌ మార్క్‌1ఏ ట్యాంకును ప్రధానికి అందచేశారు.

అనంతరం ఈ ట్యాంకును మోదీ జాతికి అంకితమిచ్చారు. కాంట్రాక్ట్‌ అనంతరం రెండున్నర ఏళ్లలో తొలి బ్యాంచ్‌ కింద ఐదు కొత్త వెర్షన్‌ అర్జున్‌ ట్యాంకులను ఆర్మీకి అందజేస్తారు. ఎంబీటీ అర్జున్ ట్యాంక్‌ ద్వారా లేజ‌ర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌ను డీఆర్‌డీవో విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. అహ్మద్‌నగ‌ర్‌లోని కేకే ప‌ర్వత శ్రేణుల్లో ఈ ప‌రీక్షను నిర్వహించారు. ఏటీజీఎం ప‌రీక్ష ద్వారా సుమారు 3 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను విజ‌య‌వంతంగా ధ్వంసం చేసిన‌ట్లు డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు తెలిపారు.