PM Modi : సాయుధ దళాల చీఫ్‌లకు దేశీయ అభివృద్ధి పరికరాలను అందించనున్న మోదీ

  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(నవంబర్-19,2021)ఉత్తరప్రదేశ్ లోని మహోబా, ఝాన్సీ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ

PM Modi :  సాయుధ దళాల చీఫ్‌లకు దేశీయ అభివృద్ధి పరికరాలను అందించనున్న మోదీ

Modi

PM Modi    ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(నవంబర్-19,2021)ఉత్తరప్రదేశ్ లోని మహోబా, ఝాన్సీ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించనున్నారు. మహోబాలో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత ఝాన్సీని సందర్శిస్తారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా నవంబర్ 17న ఝాన్సీలో ప్రారంభమైన ‘రాష్ట్ర రక్ష సంపర్పణ్ పర్వ్’లో రక్షణ రంగం యొక్క పలు ఆవిష్కరణలను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని.

రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిచ్చేందుకు…దేశీయంగా రూపొందించిన,అభివృద్ధి చేసిన పరికరాలను సాయుధ దళాల సర్వీస్ చీఫ్‌లకు అధికారికంగా అందజేయనున్నారు మోదీ. వీటిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) రూపొందించిన, అభివృద్ధి చేసిన లైట్ కంబాట్ హెలికాప్టర్ (LCH)ని ఎయిర్ స్టాఫ్ చీఫ్‌కి అప్పగించడం,భారతీయ స్టార్టప్‌లచే రూపొందించి,అభివృద్ధి చేయబడిన డ్రోన్లు/UAVలు ఆర్మీ స్టాఫ్ చీఫ్‌ కి అప్పగించడం, నావల్ షిప్‌ల కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) డిజైన్ చేసి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఉత్పత్తి చేసిన అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ను నావల్ చీఫ్ కు అప్పగించడం ఉన్నాయి.

యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లోని ఝాన్సీ నోడ్ వద్ద రూ.400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల కోసం ప్రొపల్షన్ సిస్టమ్‌లను ఉత్పత్తి చేయడానికి ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది.

అంతేకాకుండా, ఎన్‌సిసి పూర్వ విద్యార్థులు ఎన్‌సిసితో తిరిగి కనెక్ట్ అయ్యేలా ఒక అధికారిక వేదికను అందించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి ఎన్‌సిసి పూర్వ విద్యార్థుల సంఘాన్ని ప్రారంభిస్తారు. ఝాన్సీ పర్యటన సందర్భంగా దేశంలోని మొత్తం 33 సైనిక్ పాఠశాలలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 33 మంది బాలికలతో మంత్రి నరేంద్ర మోదీ సంభాషించనున్నారు.

ఝాన్సీలో అటల్ ఏక్తా పార్కును కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. మాజీ ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు మీదుగా దాదాపు 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ. 11 కోట్ల వ్యయంతో ఈ పార్కును నిర్మించారు. ఇందులో లైబ్రరీతో పాటు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహం కూడా ఉంటుంది. ప్రముఖ శిల్పి రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని నిర్మించారు.