PM Modi: పీఎం మోదీ చేతుల మీదుగా తమిళనాడులో 11 మెడికల్ కాలేజీలు ప్రారంభం

ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా 11 ప్రభుత్వ కాలజీలు ప్రారంభం కానున్నాయి. తమిళనాడులో సాయంత్రం 4గంటలకు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా కాలేజీలను ప్రారంభిస్తారు.

PM Modi: పీఎం మోదీ చేతుల మీదుగా తమిళనాడులో 11 మెడికల్ కాలేజీలు ప్రారంభం

PM Modi Review

PM Modi: ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా 11 ప్రభుత్వ కాలజీలు ప్రారంభం కానున్నాయి. తమిళనాడులో సాయంత్రం 4గంటలకు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా కాలేజీలను ప్రారంభిస్తారు. కొత్త మెడికల్ కాలేజీల ద్వారా 1450సీట్స్ అందుబాటులోకి రానున్నాయి. సెంట్రల్ స్పాన్సర్‌డ్ స్కీం ద్వారా.. ఈ కాలేజీలను జిల్లా/రిఫరల్ హాస్పిటల్ కు అటాచ్ చేస్తారు.

పీఎంఓ నుంచి అందిన డేటా ప్రకారం.. గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజీల సంఖ్య 387 నుంచి 596కు పెరిగింది. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 79.60శాతం పెరిగింది. అంటే 51వేల 348 నుంచి 92వేల 222కు చేరింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో సీట్ల సంఖ్య 80.70 శాతం పెరిగిందట.

11మెడికల్ కాలేజీలతో పాటు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ కొత్త క్యాంపస్ ను కూడా ప్రారంభించనున్నారు. సీఐసీటీ అద్దె బిల్డింగులో నడిపిస్తుండగా.. ఇప్పుడు కొత్త బిల్డింగులోకి మారుస్తారు. ఇందులో సంప్రదాయ భాషలు, భారత సంస్కృతిని పరిరక్షించే కోర్సులు నేర్పిస్తారు.

ఇది కూడా చదవండి : ‘రామారావు’తో రచ్చ రంబోలా..

తమిళనాడులోని విరుద్ధునగర్, నమక్కల్, ద నీలిగిరీస్, తిరుప్పూర్, తిరువల్లూరు, నాగపట్నం, దిండిగల్, కల్లకురుచి, అరియలూర్, రామనాథపురం, కృష్ణగిరి జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయి. దాదాపు రూ.4వేల కోట్ల అంచనా ఉన్న ఈ నిర్మాణాలకు కేంద్రం నుంచి రూ.2వేల 145కోట్లు అందాయని చెబుతుండగా మిగిలింది తమిళనాడు ప్రభుత్వమే భరించింది.