E-RUPI : ఫోన్‌పే, గూగుల్‌ పే లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్

చాలా ఈజీగా క్యాష్ లెస్, కాంటాక్ట్ లెస్ గా ఉండేలా ‘ఈ - రూపీ స్కీం’ (E-Rupi)ని ప్రవేశపెట్టనున్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కొత్త స్కీంను రూపొందించింది. ఈ రూపీ పథకం 2021, ఆగస్టు 02వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

E-RUPI : ఫోన్‌పే, గూగుల్‌ పే లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్

Modi

PM Modi To Launch e-RUPI : డిజిటల్ పేమెంట్ (నగదు రహిత) పేమెంట్స్ వైపు చాలా మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. వీటి ద్వారా చాలామంది పేమెంట్స్ చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి మరొక సర్వీసును తీసుకురానున్నారు. అందుబాటులో ఉన్న పేమెంట్ విధానాలకంటే…చాలా ఈజీగా క్యాష్ లెస్, కాంటాక్ట్ లెస్ గా ఉండేలా ‘ఈ – రూపీ’ (E-Rupi)ని రూపొందించారు.

దీనిని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించింది. ప్రధాని మోడీ చేతులమీదుగా ప్రారంభించనున్న ‘ఈ రూపీ’ 2021, ఆగస్టు 02వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

Read More : Zika Virus: జికా వైరస్ వ్యాప్తి.. లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందే లబ్దిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే..ప్రభుత్వ సాయం అందనుంది. లబ్దిదారుల ఉపయోగించే మొబైల్ ఫోన్ కు క్యూ ఆర్ కోడ్, SMS వౌచర్ రూపంలో నగదు చేరనుంది. ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూ ఆర్ కోడ్ (QR code) లేదా ఎస్ఎమ్మెస్ (SMS) వోచర్ ల ద్వారా లబ్దిదారుడి మొబైల్ ఫోన్ కి పంపిస్తారు. ఈ క్యూ ఆర్ కోడ్ ను లబ్దిదారుడు అవసరమైన చోట ఉపయోగించుకోవచ్చని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.

Read More : Vizag Steel Plant: కదిలిన కార్మిక లోకం.. ఢిల్లీలో రెండు రోజుల నిరసనలు!
డిజిటల్ లావాదేవీల ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ – రూపీ యాప్ ను అమల్లోకి తెస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే..దీనిని ముందుగా ఆయుష్మాన్ భారత ప్రధాన జన్ ఆరోగ్య యోజనా పథకంలో టీబీ రోగులకు ప్రతి నెలా ఔషధాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా..మాతా శిశు అభివృద్ధి పథకం కింద పౌష్టికాహారం, రైతులకు సబ్సిడీ కింద ఎరువులు అందిస్తోంది. వీటికి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని రాబోయే రోజుల్లో ఈ రూపే ద్వారా కేంద్రం చేపట్టనుంది.