Parakram Diwas: అండమాన్ దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టనున్న మోదీ.. 21 దీవులకు 21 పేర్లు

అండమాన్ దీవుల్లోని కొన్ని దీవులకు ఈ రోజు పేర్లు పెట్టబోతున్నారు. అండమాన్-నికోబార్ దీవుల్లోని 21 దీవులకు 21 మంది ‘పరమవీర చక్ర’ అవార్డు గ్రహీతల పేర్టు పెట్టనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

Parakram Diwas: అండమాన్ దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టనున్న మోదీ.. 21 దీవులకు 21 పేర్లు

Parakram Diwas: ‘జాతీయ పరాక్రమ్ దివస్’ సందర్భంగా ప్రధాని మోదీ మహత్తర కార్యక్రమం చేపట్టబోతున్నారు. జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అనే సంగతి తెలిసిందే. ఈ రోజును ప్రతి ఏటా పరాక్రమ దివస్‌గా జరుపుతారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతారు.

California Shooting: క్యాలిఫోర్నియా కాల్పుల నిందితుడు ఆత్మహత్య.. పోలీసులు చుట్టుముట్టడంతో గన్‌తో కాల్చుకుని మృతి

ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రధాని మోదీ ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నారు. అండమాన్ దీవుల్లోని కొన్ని దీవులకు ఈ రోజు పేర్లు పెట్టబోతున్నారు. అండమాన్-నికోబార్ దీవుల్లోని 21 దీవులకు 21 మంది ‘పరమవీర చక్ర’ అవార్డు గ్రహీతల పేర్టు పెట్టనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ 21 దీవుల్లో అతి పెద్ద దీవికి మొదటి పరమ వీర చక్ర అవార్డు గ్రహీత పేరు, రెండో పెద్ద దీవికి రెండో పరమ వీర చక్ర అవార్డు గ్రహీత పేరు.. ఇలా వరుసగా 21 దీవులకు మొదటి 21 అవార్డు గ్రహీతల పేర్లు పెడతారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఇదే మొదటిసారి. దేశం కోసం పోరాడిన నిజమైన హీరోలకు దేశమెప్పుడూ అధిక ప్రాధాన్యం ఇస్తుందని మోదీ అన్నారు.

Karimnagar: కరీంనగర్‌లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేటి నుంచి 11 రోజులపాటు వేడుకలు

దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు ప్రాణ త్యాగం చేసిన అమరులకు ఈ నిర్ణయం గొప్ప నివాళి అని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. 2018లో కేంద్ర పాలిత ప్రాంతమైన రాస్ ఐలాండ్‌కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం అని మోదీ పేరు పెట్టారు. అలాగే నీల్ ఐలాండ్‌ను షాహీద్ ద్వీప్ అని, హ్యావెలాక్ ఐలాండ్‌ను స్వరాజ్ ద్వీప్ అని పేరు మార్చారు. సోమవారం దేశవ్యాప్తంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంత్యుత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. నేతాజీ 1897 జనవరి 23న జన్మించారు. ఆయనకు జయంతి తప్ప.. వర్ధంతి లేదనే సంగతి తెలిసిందే.