Azadi Ka Amrit Mahotsav : ప్రధాని మోదీ అధ్యక్షతన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశం

75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా శనివారం సాయంత్రం 4-30 గంటలకు ఢిల్లీలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశం జరుగుతుంది.

Azadi Ka Amrit Mahotsav : ప్రధాని మోదీ అధ్యక్షతన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశం

Azadi Ka Amrit Mahotsav : 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా శనివారం సాయంత్రం 4-30 గంటలకు ఢిల్లీలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌ కల్చరల్ సెంటర్‌లో జరిగే ఈ సమావేశంలో కమిటీలో సభ్యులుగా ఉన్న లోక్‌సభ స్పీకర్, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు, అధికారులు, మీడియా ప్రముఖులు, ఆధ్యాత్మిక నాయకులు, కళాకారులు, సినీ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.

75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ, హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలతోపాటు కమిటీ సభ్యుల సలహాలు, సూచనలను కేంద్రం తీసుకుని అమలు చేయనుంది. ఆజాదికా అమృత్ మహోత్సవ కమిటీ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ దూరంగా ఉన్నారు. కాగా ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్లతో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హజరవుతున్నారు.