PM Kisan Funds : రైతులకు గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లోకి డబ్బులు

అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనుంది. 10 కోట్ల మందికిపైగా ఖాతాల్లో రూ.21వేల కోట్లకు పైగా నిధులు..(PM Kisan Funds)

PM Kisan Funds : రైతులకు గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లోకి డబ్బులు

Pm Kisan Funds

PM Kisan Funds : అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 31న వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనుంది. పీఎం కిసాన్ స్కీమ్ 11వ విడతకు సంబంధించిన నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికిపైగా రైతుల ఖాతాల్లో రూ.21వేల కోట్లకు పైగా నిధులను కేంద్రం జమ చేయనుంది. ఈ పథకం ద్వారా రైతులకు కేంద్రం ఆర్థిక భరోసా అందిస్తోంది. ఏటా మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున రూ.6వేలు అందిస్తోంది.

ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ వేడుక‌ల్లో భాగంగా మోదీ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను గుర్తు చేస్తూ గ‌రీబ్ క‌ళ్యాణ్ స‌మ్మేళ‌న్ పేరుతో కేంద్రం కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31న సిమ్లాలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న ల‌బ్ధిదారుల‌తో మాట్లాడతారు. అక్కడి నుంచే 11వ విడ‌త పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.(PM Kisan Funds)

Pm Kisan

Pm Kisan

కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) ఒకటి. దీనికి 100 శాతం ఫండింగ్ కేంద్రమే ఇస్తోంది. 2018 డిసెంబర్ లో మోదీ సర్కార్ ఈ పథకాన్ని ఆవిష్కరించింది. ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 6వేలు అందిస్తోంది. ఒకేసారి కాకుండా ఏడాదికి మూడు విడతల్లో రైతులకు డబ్బులు అందుతున్నాయి. రూ. 2 వేల చొప్పున పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు వస్తాయి. 2022 జనవరి 1న పీఎం కిసాన్ పదో విడత డబ్బులు వచ్చాయి. మే 31వ తేదీన 11వ విడత డబ్బులు లభించనున్నాయి. కాగా, ఈకేవైసీ పూర్తయిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయి.

PM KISAN: పీఎం కిసాన్ పథకం వర్తించాలంటే అలా చేయాల్సిందే.. మే31 వరకే అవకాశం..

పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు రైతుల ఖాతాలోకి ఇప్పటికే పడాల్సి ఉన్నా, పలు కారణాల వల్ల ఆలస్యమైంది. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లో అత్యంత కీలకమైన ఈ-కేవైసీ ఆప్షన్ ను కొంతకాలంపాటు తొలగించిన కేంద్రం.. తిరిగి ఆ సౌకర్యాన్ని తిరిగి అందుబాటులోకి తేవడం తెలిసిందే. ఈ కేవైసీ గడువు ఈ నెల 31తో ముగియనుంది.

Pm Kisan Scheme

Pm Kisan Scheme

పీఎం కిసాన్ పథకంలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించిన కేంద్రం దాదాపు అన్ని రాష్ట్రాల్లో నకిలీ లబ్దిదారులను జల్లెడపట్టింది. లక్షల సంఖ్యలో తప్పుడు అకౌంట్లను తొలగించింది. వడ పోత ముగిసిన నేపథ్యంలో పీఎం కిసాన్ 11వ విడత సాయం విడుదలకు ఏర్పాట్లు జరిగాయి.(PM Kisan Funds)

PM Kisan : రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. పడ్డాయో లేదో ఇలా తెలుసుకోవచ్చు..

పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్ లో పడ్డాయో లేదో అనేది రైతులు సులభంగానే తెలుసుకోవచ్చు.
* పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు(https://pmkisan.gov.in) వెళ్లి అందులో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
* దీని కోసం ఫార్మర్స్ కార్నర్‌లో ఉన్న బెనిఫీషియరీ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోవాలి.
* దీనిపై క్లిక్ చేయాలి.
* తర్వాత కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
* ఇందులో ఆధార్ నెంబర్ లేదా బ్యాంకు అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
* ఆ తర్వాత గెట్ డేటాపై క్లిక్ చేయండి.
* ఇక్కడ మీరు 11వ విడత డబ్బులు వచ్చాయో? లేదో? తెలుస్తుంది.(PM Kisan Funds)
* డబ్బులు రాకపోతే ఎందుకు రాలేదో కారణం కూడా ఉంటుంది.
* దాన్ని సరిచేసుకుంటే మళ్లీ పీఎం కిసాన్ డబ్బులు పొందే అవకాశం ఉంది.
* రైతుల సౌకర్యార్థం పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ కూడా అందుబాటులో ఉంది.
* ఈ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖను సంప్రదించవచ్చు.
* PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 155261, 011-24300606.

Pm Kisan Yojana

Pm Kisan Yojana

వీరు పీఎం కిసాన్ కు అనర్హులు..
* రైతు కుటుంబంలో ఎవరైనా ఆదాయపన్ను (ఐటీ) చెల్లింపుదారులుంటే వారికి పీఎం కిసాన్ పథకం వర్తించదు.
* అలాగే సాగు భూమి లేని వారిని కూడా పీఎం కిసాన్ యోజన నుంచి మినహాయించారు.
* తాత లేదా తండ్రి పేరు మీద లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద వ్యవసాయ భూమి ఉన్నప్పుడు కూడా రైతులు పీఎం కిసాన్ ద్వారా ప్రయోజనం పొందలేరు.
* భూమి యజమాని ప్రభుత్వ ఉద్యోగి అయితే అతనికిది వర్తించదు.
* రిజిస్టర్డ్ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సీఏలు కూడా పీఎం కిసాన్ పథకానికి అనర్హులు.
* ఒక రైతు సంవత్సరానికి రూ. 10వేల పెన్షన్ పొందినట్లయితే, వారు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు.
* నిబంధనలను అతిక్రమించి పీఎం కిసాన్ సాయం పొందుతున్నట్లు తేలితే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.