23న కోల్ కతాకి మోడీ..అదే రోజున మమత పాదయాత్ర

23న కోల్ కతాకి మోడీ..అదే రోజున మమత పాదయాత్ర

Modi to visit Kolkata జనవరి-23(శనివారం)నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ 125 జ‌యంతి సందర్భంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ కి మోడీ వెళ్లనున్నారు. ఈ ఏడాది నుంచి నేతాజీ జ‌యంతిని ప‌రాక్ర‌మ్ దివ‌స్‌గా జ‌ర‌పాల‌ని నిర్ణ‌యిస్తూ రెండు రోజుల క్రితం కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక ప్ర‌క‌ట‌న జారీ చేసిన విషయం తెలిసిందే. కోగా, శనివారం ప్రధాని మోడీ కోల్ కతాలో పరాక్రమ్ దివస్ సెలబ్రేషన్స్ లో పాల్గొననున్నట్లు సామాచారం.

కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం… విక్టోరియా మెమోరియల్ దగ్గర నిర్వహించే కార్యక్రమంలో మోడీ పాల్గొంటారు. కోల్ కతాలోని నేషనల్ లైబ్రరీ వద్ద జరిగే మరో కార్యక్రమంలో కూడా మోడీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఓ ఎగ్జిబిషన్ మరియు కొన్ని పునరుద్దరించబడిన ఆర్కిటెక్చరల్ సైట్స్ ని ప్రధాని ప్రారంభిస్తారు. నేతాజీ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ(INA)కి చెందిన ముఖ్యమైన వ్యక్తులను మోడీ సస్మానిస్తారు. మోడీ వెంట ఈ కార్యక్రమాల్లో బెంగాల్ గవర్నర్ జగదీప్ ధనకర్ కూడా పాల్గొంటారు. ప్రధాని పర్యటనలో రాజకీయ కార్యక్రమం గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు.

అమరవీరులైన 26,000 INA సభ్యుల గౌరవార్థం ఓ మెమోరియల్ ని నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు సాంస్కృతికశాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు. మరోవైపు, నేతాజీ జయంతి రోజునే అసోంలో కూడా మోడీ పర్యటించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. అదే రోజున అసోంలోని శివసాగర్ లో ఒక లక్షకు పైగా భూమి పట్టాలను(కేటాయించిన సర్టిఫికెట్లు)ను మోడీ డిస్టిబ్యూట్ చేయనున్నారు. ఏప్రిల్-మే నెలల్లో బెంగాల్,అసోం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు,జనవరి-23న నేతాజీ జయంతి సందర్భంగా కోల్ కతాలో పాదయాత్ర చేయనున్నట్లు సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు