PM Modi : యాస్ తుపాన్, బెంగాల్, ఒడిషా రాష్ట్రాలకు మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. యాస్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్‌ సర్వే నిర్వహించారు. తుఫాన్‌ బీభత్సంపై సమీక్షిస్తారు. తొలుత ఒడిశాలో పర్యటించనున్న మోదీ... భువనేశ్వర్‌లో అధికారులతో సమావేశమవుతారు.

PM Modi : యాస్ తుపాన్, బెంగాల్, ఒడిషా రాష్ట్రాలకు మోడీ

Modi

Odisha And Bengal : ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. యాస్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్‌ సర్వే నిర్వహించారు. తుఫాన్‌ బీభత్సంపై సమీక్షిస్తారు. తొలుత ఒడిశాలో పర్యటించనున్న మోదీ… భువనేశ్వర్‌లో అధికారులతో సమావేశమవుతారు. తుఫాన్‌ నష్టంపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత బాలాసోర్‌, భద్రక్‌ జిల్లాల్లో ఏరియల్‌ సర్వే ద్వారా తుఫాన్‌తో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తారు.

ఒడిశాలో టూర్‌ ముగించుకున్న తర్వాత ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌ వెళ్తారు. తూర్పు మిడ్నాపూర్‌కు చేరుకోనున్న ప్రధాని నరేంద్రమోదీ… కలైకుండలోని తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహిస్తారు. యాస్‌ తుఫాన్‌ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారు. అనంతరం బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర అధికారులతో కలైకుండలో మోదీ సమావేశమవుతారు. బెంగాల్‌లో శాసనసభ ఎన్నికల తర్వాత మోదీ, మమత తొలిసారి సమావేశం కాబోతున్నారు.

యాస్‌ తుపానుతో బెంగాల్‌లో దాదాపు 15 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. వ్యవసాయం, విద్యుత్తు, మత్స్య సంపద, పశుసంవర్ధక, ఉద్యానవన రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు చెప్పారు. నష్టపోయిన రైతులు, సర్వం కోల్పోయిన పేదలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. పీఎం ప్రధానితో జరిగే సమావేశంలోనూ ఆమె రాష్ట్రానికి చేయాల్సిన సాయంపై వినతి పత్రాన్ని అందించనున్నారు.

Read More : Bimbisara : బార్బేరియన్ కింగ్ ‘బింబిసార’ గా నందమూరి కళ్యాణ్ రామ్..!