Black Bucks : వేలాది కృష్ణ జింకలు రోడ్డు దాటుతున్న అద్భుతమైన వీడియో షేర్ చేసిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ ఓ అందమైన అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. గుజరాత్ లోని ఓ అడవిలో వేలాది కృష్ణజింకలు రోడ్డు దాటుతున్న అద్భతమైన వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మోడీ షేర్ చేసిన వీడియోలో దాదాపు 3వేల కృష్ణ జింకలు చెంగు చెంగున దూకుతు రోడ్డు దాటుతున్నాయి.

10TV Telugu News

Black Bucks crossing : ప్రధాని నరేంద్ర మోడీ ఓ అందమైన అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. గుజరాత్ లోని ఓ అడవిలో వేలాది కృష్ణజింకలు రోడ్డు దాటుతున్న అద్భతమైన వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మోడీ షేర్ చేసిన వీడియోలో దాదాపు 3వేల కృష్ణ జింకలు చెంగు చెంగున దూకుతు రోడ్డు దాటుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ లోని కృష్ణజింకల జాతీయ పార్కులో చిత్రీకరించిన ఈ వీడియోను గుజరాత్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ షేర్ చేసింది.

దీంతో అద్భుతమైన ఈ వీడియోను ప్రధాని ట్వీట్ లో పంచుకున్నారు. ‘అద్భుతం’అనే క్యాప్షన్ తో ప్రధాని మోదీ షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆనందాశ్చర్యాలకు గురి చేస్తోంది. 3వేల కృష్ణ జింకలు రెండు బారులుగా తీరి చెంగుచెంగున దూకుతూ రోడ్డు దాటుతున్న అరుదైన వీడియోను చూసిన నెటిజన్లు వావ్..వాటే బ్యూటిఫుల్ అండ్ రేర్ సీన్ అంటూ తెగ మురిసిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ షేర్ చేసిన ఈ వీడియోకు 22,600 మందికి పైగా నెటిజన్ల నుంచి లైక్ లు వచ్చాయి. అద్భుతమైన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఎంజాయ్ చేయటమే కాకుండా ఎమోజీలతో చప్పట్ల వర్షం కురిపించారు.

 

కృష్ణ జింకలు విశాలమైన పచ్చిక మైదానాలలో జీవిస్తుంటాయి. రకరకాల గడ్డిని, అప్పుడప్పుడు పండ్ల ఆహారంగా తింటాయి. వేగంగా పరిగెత్తగలిగే జంతువులలో ఇది ఒకటి. చిరుతపులికి చిక్కకుండా తప్పించుకునేంత వేగం కృష్ణ జింక సొంతం.ఇవి 15-20 జింకలు కలిసి ఒక మందగా తిరుగుతుంటాయి. ప్రతి మందలోను ఒక బలిష్టమైన మగ జింక ఉంటుంది.

మగ జింకలో శరీరపు పైభాగం నలుపు లేదా ముదురు గోధుమగంగులో ఉంటే, కడుపు, ఇంకా కళ్ళు చుట్టూ ఉండే ప్రాంతం మాత్రం తెలుపురంగులో ఉంటుంది. ఆడ కృష్ణ జింకలు వీటికి భిన్నంగా లేత గోధుమ రంగులో ఉంటాయి. వీటికి కొమ్ములుండవు. అందంతో పాటు వేగం వీటి సొంతం. ఆ..అన్నట్లు కృష్ణ జింక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు అనే విషయం తెలిసిందే.

10TV Telugu News