PM Modi: గాంధీనగర్‌లో తల్లి హీరాబెన్ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోదీ.. రేపు అహ్మదాబాద్‌లోనే ..

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం గాంధీనగర్‌లోని తన తల్లి హీరాబెన్ మోదీ వద్దకు వెళ్లారు. కొద్దిసేపు తల్లితో మోదీ ముచ్చటించారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు.

PM Modi: గాంధీనగర్‌లో తల్లి హీరాబెన్ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోదీ.. రేపు అహ్మదాబాద్‌లోనే ..

PM MODI

PM Modi:PM MOdi: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం గాంధీనగర్‌లోని తన తల్లి హీరాబెన్ మోదీ వద్దకు వెళ్లారు. కొద్దిసేపు తల్లితో మోదీ ముచ్చటించారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం తల్లి పాదాలకు నమస్కారం చేసి మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు తల్లితోనే ఉన్నారు. ఇదిలాఉంటే గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం విధితమే. మొదటి విడత పోలింగ్ పూర్తయింది. రేపు రెండవ విడత పోలింగ్ జరగనుంది. తుది దశ పోలింగ్‌లో అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రధాని మోదీకి అహ్మదాబాద్‌లోని సబర్మతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓటు హక్కు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడికి వచ్చారు. అందులో భాగంగా తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు ప్రధాని మోదీ. రేపు ప్రధానితో పాటు అమిత్ షా సహా ఆయా పార్టీల అగ్రనేతలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

pm narendra modi

pm narendra modi

రెండో దశ పోలింగ్ లో భాగంగా సోమవారం సెంట్రల్ గుజరాత్, ఉత్తర గుజరాత్ లలో ఓటింగ్ జరగనుంది. 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 69 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 764 మంది పురుష అభ్యర్థులు ఉన్నారు.

pm narendra modi

pm narendra modi

సౌరాష్ట్ర, కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 89 స్థానాలకు మొదటి దశ ఓటింగ్ డిసెంబర్ 1న జరిగింది. సగటున 63.31 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడత పోలింగ్ లో ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావటంతో రెండవ దశలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం విస్తృత ప్రచారం నిర్వహించింది.