PM Modi’s Flight : రూటు మార్చిన మోదీ ఫ్లైట్..పాక్ గగనతలం మీదుగా

  క్వాడ్ శిఖరాగ్ర సదస్సు, ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడం సహా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​లతో ద్వైపాక్షిక చర్చల కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

PM Modi’s Flight : రూటు మార్చిన మోదీ ఫ్లైట్..పాక్ గగనతలం మీదుగా

Pm Modi (2)

PM Modi’s Flight  క్వాడ్ శిఖరాగ్ర సదస్సు, ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడం సహా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​లతో ద్వైపాక్షిక చర్చల కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం మూడు రోజుల పర్యటన కోసం భారత వీవీఐపీ విమానమైన “ఎయిర్ఇండియా వన్” లో అమెరికా బయల్దేరిన విషయం తెలిసిందే. అయితే మోదీ ప్రయాణిస్తున్న విమానం అప్ఘానిస్తాన్ మీదుగా కాకుండా పాకిస్తాన్ గగనతలంపై నుంచి వెళ్లింది. సాధారణంగా అప్ఘానిస్తాన్ నుంచి వెళ్లాల్సిన విమానాన్ని.. భద్రత కారణాల దృష్ట్యా పాక్ మీదుగా తీసుకెళ్లారు అధికారులు. మోదీ ప్రయాణం కోసం తన గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు పాకిస్తాన్ అనుమతించింది.

అఫ్గాన్​లో భద్రతా పరిస్థితులు ఆందోళకరంగా ఉన్న నేపథ్యంలో ఆ దేశ గగనతలాన్ని ఉపయోగించుకోవద్దని భారత నిఘా వర్గాలు సూచించాయి. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటన కోసం మోదీ విమానానికి అనుమతి ఇవ్వాలని భారత్.. పాక్​ను కోరింది. భారత్ చేసిన అభ్యర్థనకు పాకిస్తాన్ సానుకూలంగా స్పందించి అనుమతిచ్చిందని అధికారులు తెలిపారు. అప్ఘాన్ గగనతలం నుంచి కాకుండా పాకిస్తాన్​పై నుంచి వెళ్తుండటం వల్ల ప్రయాణ సమయం గంట అధికమవుతుందని తెలిపారు.

కాగా, ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్​పై గుర్రుగా ఉన్న పాకిస్తాన్ తన గగనతలాన్ని ఉపయోగించుకోకుండా చేస్తోంది. గతంలో భారత రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఐస్​లాండ్ పర్యటన సహా మోదీ అమెరికా, జర్మనీ పర్యటనల కోసం భారత అధికారులు అనుమతులు కోరగా.. ఈ మూడుసార్లూ అనుమతులు తిరస్కరించింది పాకిస్తాన్. దీనిపై అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ వద్ద భారత్ నిరసన వ్యక్తం చేసింది. అయితే, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శ్రీలంక పర్యటన కోసం మన గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు భారత్ అనుమతించడం గమనార్హం.

READ ప్రధాని మోదీ అమెరికా టూర్ షెడ్యూల్