#9YearsOfModi Govt : మోదీ తొమ్మిదేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్‌ సంక్షోభం .. మహమ్మారిని ఎదుర్కొన్న తీరుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు..

మోదీ తొమ్మిదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా సంక్షోభం.. ఏడాది నుంచి యుక్రెయిన్‌-రష్యా వార్‌ సవాల్‌గా మారాయి. ప్రపంచ సంక్షోభం భారత్ పైకూడా పడింది. అయినా అన్నింటిని తట్టుకుని నిలబడి ..వైద్య రంగానికి, విద్యారంగానికి కూడా మోడీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది.

#9YearsOfModi Govt : మోదీ తొమ్మిదేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్‌ సంక్షోభం .. మహమ్మారిని ఎదుర్కొన్న తీరుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు..

9YearsOfModi Govt Covid time

9Years Of Modi Govt : మోదీ తొమ్మిదేళ్ల పాలనలో అత్యధిక గడ్డుకాలం కోవిడ్‌ సమయం. దాదాపు రెండేళ్ల పాటు మహమ్మారి ముప్పుతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. కరోనా అన్ని రంగాలను అస్తవ్యస్తంగా మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రగతి కుంటుపడింది.  ద్రవ్యోల్బణం పెరిగింది. ఇంధన ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. దీంతో మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలతో టార్గెట్ చేశాయి.  అలాగే అదానీ వ్యవహారంలోనూ బీజేపీ ప్రభుత్వం  తీరును తప్పుబట్టాయి.  అదానీ వ్యవహారంపై పార్లమెంట్ సభలు దద్దరిల్లాయి. ప్రధాని మోదీ అండదండలతోనే అదానీ సామ్రాజ్యం విస్తరించిందని  ప్రతిపక్షాల విమర్శలకూ మోదీ ప్రభుత్వం కూడా స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చింది.

 

తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో ఘన విజయాలు సాధించిన మోదీ సర్కార్‌కు రెండేళ్ల పాటు కరోనా.. ఏడాది నుంచి యుక్రెయిన్‌-రష్యా వార్‌ సవాల్‌గా మారింది. కోవిడ్‌ మహహ్మారి వల్ల ఆర్థిక రంగంతోపాటు అనేక రంగాలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రగతి మందగించి గడ్డుకాలం అనుభవించాల్సివచ్చింది. ప్రపంచ సంక్షోభం మన దేశంపైనా పడింది. కోవిడ్‌ నుంచి ఎలాగోలా బయటపడ్డామనే సమయానికి యుక్రెయిన్‌-రష్యా యుద్ధం కొత్త సమస్యగా మారింది. కోవిడ్‌ నుంచి యుద్ధం వరకు ముడిచమురు ధరలు మండిపోతుండటం.. ద్రవ్యోల్బణానికి దారితీసింది. ఇది నిత్యావసర సరుకుల ధరల పెరుగుదులకు కారణమవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

 

మోదీ పాలన కాలంలో కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొన్న తీరు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు తెచ్చిపెట్టింది. 2020 నుంచి 2022 వరకు ప్రపంచ దేశాలన్నీ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. సుదీర్ఘ లాక్‌డౌన్‌లతో ఆర్థిక రంగం అతలాకుతలమైంది. కాని, మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్‌ చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. మోదీ సాహసోపేత నిర్ణయాలతో కోవిడ్‌ గడ్డుకాలం నుంచి దేశం తొందరగా బయటపడింది. మహమ్మారిపై పోరాటానికి అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. యుద్ధప్రాతిపతికన టీకాలు పంపిణీ చేయడమే కాక.. దేశ వ్యాప్తంగా 220 కోట్ల డోసుల టీకాలు పంపిణీ చేసి మహమ్మారిని అదుపు చేసింది. అంతేకాకుండా ఫస్ట్‌, సెకెండ్‌ వేవ్‌ల్లో లిక్విడ్ ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు 900 ఆక్సిజన్ రైళ్లను నడిపింది. 4 వేల రైల్వే కోచ్‌లను తాత్కాలిక ఆస్పత్రులుగా మార్చి రోగులకు సత్వర వైద్యం అందేలా చర్యలు తీసుకుంది ప్రభుత్వం.

#9YearsOfModi Govt : మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో మైలురాళ్లు .. మరెన్నో సంచలన నిర్ణయాలు

కీలకమైన విద్యారంగానికి పెద్దపీట వేశారు మోదీ. దేశవ్యాప్తంగా యూనివర్శిటీలు, ఐఐటీలు, ఐఐఎం వంటి సంస్థలు నిర్మాణానికి ప్రోత్సహించారు. చదువుకున్న యువతకు గేట్‌వే పరిచారు. మోదీ సర్కార్‌ విధానాల వల్ల దేశంలోని విశ్వవిద్యాలయాల సంఖ్య గత 9 ఏళ్లలో గణనీయంగా పెరిగింది, 2014లో 723 ఉన్న యూనివర్సిటీలు.. ప్రస్తుతం 11 వందలకు చేరుకున్నాయి. కొత్తగా 5 వేల కళాశాలలు నిర్మించారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటైన కాలేజీలు, యూనివర్సిటీలను గ్రామీణ ప్రాంతాలకే కేటాయించారు. 43 శాతం యూనివర్సిటీలు, 61.4 శాతం కాలేజీలను రూరల్‌ ఏరియాలోనే స్థాపించి విద్యను గ్రామీణులకు చేరువ చేసింది మోదీ ప్రభుత్వం.

 

ఇక వైద్య రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తెచ్చారు మోదీ. 2018లో కేంద్రం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం గ్రామీణుల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేసింది. ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 22 కోట్ల మంది లబ్ధిపొందారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా కార్యక్రమంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇదే సమయంలో అధికారంలోకి వచ్చిన నుంచి కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు మోదీ. 2014 నుంచి ఇప్పటివరకు 9 వేల 663 మెడికల్ సీట్లను కొత్తగా మంజూరు చేశారు. 9 వేల జన్ ఔషధి కేంద్రాలు, లక్షలాది ఆయుష్మాన్ భారత్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Rajasthan Politics: లోక్‭సభ, అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా రాజస్థాన్‭లో మెగా ప్రచారాన్ని ప్రారంభించున్న ప్రధాని మోదీ

ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేపంపై పెద్ద ఎత్తున దృష్టిపెట్టి అందరి ప్రశంసలు పొందిన మోదీ సర్కార్‌ ప్రతిపక్షాల నుంచి విమర్శలు అంతేస్థాయిలో ఎదుర్కొంటోంది. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, బీజేపీయేతర రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో వివక్ష ప్రదర్శిస్తుంటారని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరససిస్తూ గతంలో 9 మంది విపక్ష నేతలు, ముఖ్యమంత్రులు నేరుగా ప్రధానికి లేఖ రాయడం.. సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో తమ పార్టీలను, నాయకులను వేధిస్తున్నారని ఆరోపించడం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో వివాదాస్పద రైతు చట్టాలతో తీవ్ర విమర్శలు పాలైంది మోదీ ప్రభుత్వం. బీజేపీకి గట్టి పట్టున్న ఉత్తరభారతదేశంలో రైతు చట్టాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చలరేగాయి. రోజుల తరబడి రాజధాని వెలుపల రైతులు ధర్నాలు చేయడంతో ఆ చట్టాలను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడూ ముందడుగు వేసే మోదీ.. రైతు చట్టాల విషయంలో వెనక్కి తగ్గడం విశేషంగా చెబుతుంటారు.

 

ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే ఎన్‌డీయేతర పార్టీల నాయకులు కేసుల్లో ఇరుక్కోవడం.. జైలు పాలుకావడం రాజకీయాల్లో హాట్‌టాపిక్‌ అవుతోంది. అవినీతి కేసుల్లో నేతల అరెస్టును అధికార బీజేపీ సమర్థించుకుంటున్నా.. తమ గొంతునొక్కడానికి వ్యవస్థలను దిగజార్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో దర్యాప్తు సంస్థల జోరు పెరగడంతో విపక్షాలు కూడా ఒకతాటిపైకి రావడం కనిపిస్తోంది. మోదీ పాలనలో తొలి ఐదేళ్లలో ఎవరికివారే అన్నట్లు వ్యవహరించిన ప్రతిపక్షాలు.. గత నాలుగేళ్లుగా స్వరం మార్చుతున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఒక్కతాటిపైకి వచ్చేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. మొత్తానికి విపక్ష ఐక్యత తప్ప.. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏమీ చేయలేకపోయాయి. మోదీ మాత్రం అభివృద్ధి, సంక్షేమం అనే జోడెద్దుల ఫార్ములాతో దూసుకుపోతున్నారు.