PM Narendra Modi: మోదీకి నోబెల్ శాంతి బహుమతి? నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. నోబెల్ బహుమతి కమిటీ బృందం నార్వే నుంచి భారత్‌కు వచ్చింది. ఈ సందర్భంగా నాబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ చైర్మన్ అస్లే టోజే ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

PM Narendra Modi: మోదీకి నోబెల్ శాంతి బహుమతి? నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు

PM MODI

PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. కరోనా సమయంలో పలు దేశాలకు వ్యాక్సిన్ అందించి మహమ్మారిని తరిమికొట్టడంలో కీలక పాత్ర పోషించిన నేతగా నిలిచారు. అంతేకాదు.. ప్రపంచ దేశాల మధ్య విద్వేషాలను తగ్గించడంలోనూ ప్రధాని సమర్ధుడనే వాదన వినిపిస్తోంది. ఈక్రమంలో ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. నోబెల్ బహుమతి కమిటీ బృందం నార్వే నుంచి భారత్‌కు వచ్చింది. ఈ సందర్భంగా నాబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ చైర్మన్ అస్లే టోజే ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రపంచంలో నోబెల్ శాంతి బహుమతికి అత్యంత బలమైన పోటీదారు ప్రధాని నరేంద్ర మోదీ అని, శాంతిని నెలకొల్పేందుకు ఆయన చేస్తున్న కృషిని అభినందించాల్సిందేనని ఆయన తెలిపారు.

Opposition Letter PM Modi : కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మనీశ్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ.. ప్రధాని మోదీకి విపక్షాలు లేఖ

యూరప్‌లో రష్యా – యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాన్ని నోబెల్ ప్రైజ్ కమిటీ ప్రశంసించింది. ఎలాంటి బెదిరింపులకు తావులేకుండా అణుయుద్ధం వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి వివరించేందుకు అంతర్జాతీయ రాజకీయాల్లో ఇలాంటి నాయకులు ఇంకా ఎక్కువ మంది కావాలి అని అస్లే టోజే అన్నారు. అంతేకాదు, ప్రధాని మోదీ చాలా నమ్మకమైన నాయకుడని, శాంతిని నెలకొల్పగలడని తోజే చెప్పారు. ప్రపంచంలోని పెద్ద రాజకీయ నాయకుల్లో ప్రధాని మోదీ ఒకరని, శాంతికోసం పెద్దపీట వేస్తున్నారని అన్నారు.

 

భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో ప్రధాని మోదీ చేసిన కృషిని అస్లే టోజే ప్రశంసించారు. అంతేకాదు, ప్రపంచంలో శాంతికి కీలకమైన అంశాల్లో మోదీ కృషి చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నానని, భారత్ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, రానున్నకాలంలో భారత్ అగ్రరాజ్యంగా మారడం ఖాయమని టోజే అన్నారు.