జైట్లీ మృతి పట్ల ప్రముఖుల నివాళులు…విదేశీ పర్యటన కొనసాగించాలని మోడీకి తెలిపిన జైట్లీ కుటుంబసభ్యులు

  • Published By: venkaiahnaidu ,Published On : August 24, 2019 / 09:30 AM IST
జైట్లీ మృతి పట్ల ప్రముఖుల నివాళులు…విదేశీ పర్యటన కొనసాగించాలని మోడీకి తెలిపిన జైట్లీ కుటుంబసభ్యులు

మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల రాజకీయ నాయకులు,ప్రముఖులు,కుటుంబసభ్యులు,స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మరణవార్త విని చాలా బాధపడ్డానని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. అత్యంత భారమైన బాధ్యతను నిర్వర్తించే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి జైట్లీ అన్నారు. ఆయన ఓ తెలివైన న్యాయవాది మాత్రమే కాదని,అనుభవజ్ణుడైన పార్లమెంట్ సభ్యుడు కూడా అని,విశిష్ఠ మంత్రి అని,దేశ నిర్మాణంలో ఎంతో కృషి చేశాడని కోవింద్ అన్నారు. అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని రాష్ట్రపతి తెలియజేశారు.

జైట్లీ మరణం దేశానికి కోలుకోలేని నష్టమని, తనకు వ్యక్తిగత నష్టమని ఉపరాష్ట్రపతి వెంకయ్య తెలిపారు. జైట్లీ మరణవార్త విన్నప్పటినుంచి తనకు నోటి వెంట మాటలు రావడం లేదన్నారు. జైట్లీ ఒక శక్తివంతమైన మేధావి అన్నారు. మంచి పాలనాదక్షుడన్నారు. ఎలాంటి తప్పు చేయని సమగ్రత కలిగిన వ్యక్తి జైట్లీ అని ఉపరాష్ట్రపతి అన్నారు. జైట్లీ మరణవార్త తెలిసిన వెంటనే ఆయన తన ఏపీ పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీ వెళ్లారు.

అరుణ్ జైట్లీ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన విలువైన స్నేహితుడిని కోల్పోయానని బాధపడ్డారు. దశబ్దకాలంగా తెలిసిన ఎంతో గౌరమైన వ్యక్తి, రాజకీయ దిగ్గజం మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఎంతో బాగా జీవించారు. మా అందరికి మధుర క్షణాలను వదిలేసి వెళ్లిపోయారు. జైట్లీ తామంతా మిస్ అవుతున్నామని విచారం వ్యక్తం చేశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం అబుదాబీలో ఉన్న మోడీ..జైట్లీ కుటుంబసభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. మోడీ తన విదేశీ పర్యటనను కొసాగించాలని జైట్లీ కుటుంబసభ్యులు మోడీకి తెలిపారు. విదేశీ పర్యటనను రద్దు చేసుకోవద్దని మోడీకి జైట్లీ కుటుంబసభ్యులు తెలిపారు.

అరుణ్ జైట్లీ మరణవార్త విని తాను చాలా బాధ పడినట్లు మాజీ ప్రధానిమన్మోహన్ సింగ్ అన్నారు. జైట్లీ కుబుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జైట్లీ చాలా మంచి పరిపాలనాదక్షుడన్నారు. గొప్ప పార్లమెంటేరియన్ అని తెలిపారు. జైట్లీ మరణం దేశానికి తీరని లోటు అన్నారు.

జైట్లీ మరణం చాలా బాధ కలిగించిందని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. జైట్లీ మృతి సంతాపం వ్యక్తం చేశారు. పబ్లిక్ ఫిగర్ గా,పార్లమెంటేరిన్ గా,మంత్రిగా ఆయన అందిన సేవలు ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారన్నారు. కొన్ని రోజులగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ నెల 9న ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన జైట్లీ ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(ఆగస్టు-24,2019)మధ్యాహ్నాం 12:07గంటలకు చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.