Swachh Bharat 2.0 : స్వచ్ఛ భారత్ 2.0 ని ప్రారంభించిన మోదీ

స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 మరియు అమృత్ 2.0 కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(అక్టోబర్-1,2021) ప్రారంభించారు.

Swachh Bharat 2.0 : స్వచ్ఛ భారత్  2.0 ని ప్రారంభించిన మోదీ

Modi (1)

Swachh Bharat 2.0  స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 మరియు అమృత్ 2.0 కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(అక్టోబర్-1,2021) ప్రారంభించారు. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవడామే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వీటిని రూపొందించింది.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ…నగరాలను చెత్త రహితంగా మార్చడమే స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 లక్ష్యం. ఈ 2 వ దశలో పట్టణాలను మురుగు నుంచి విముక్తి కల్పించడం మరియు భద్రతా నిర్వహణను కూడా లక్ష్యంగా పెట్టుకున్నాము. నగరాలకు తాగునీటి భద్రత కల్పించేలా మరియు మురికిగా ఉన్న నల్లా నదిలో విలీనం కాకుండా చూసుకోవడం చేస్తాం. బీఆర్ అంబేద్కర్ కలలను నెరవేర్చడంలో స్వచ్ఛ భారత్ మిషన్ 2వ దశ కూడా ఒక ముఖ్యమైన దశ. ఈరోజు వీటిని ప్రారంభించే కార్యక్రమంలో బీఆర్ అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహించడం మన అదృష్టం. పట్టణ అభివృద్ధి.. సమానత్వానికి కీలకం అని విశ్వసిస్తున్నాను. చాక్లెట్ కాయితాలు వంటివి ఇకపై ఫ్లోర్స్ పై విసరబడవు.

ఎవరైనా చాక్లెట్లు వంటివి తింటే ఆ కాయితాలను వాళ్ల జేబుల్లోనే వేసుకోవాల్సి ఉంటుంది. చుట్టపక్కల చెత్త వేయకూడదని పిల్లలు పెద్దలను హెచ్చరిస్తారు. యువత చొరవ తీసుకుంటారు. కొంతమంది.. వ్యర్థాల నుండి సంపదను సంపాదిస్తున్నారు. మరికొందరు అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛతా రెండో దశలో భాగంగా.. నగరాల్లోని చెత్త పర్వతాలు శుద్ది చేయబడతాయి మరియు పూర్తిగా తొలగించబడతాయి. అలాంటి చెత్త పర్వతం చాలాకాలంగా ఢిల్లీలో ఉంది, అది కూడా తొలగించడానికి రెడీగా ఉంది. నేడు భారతదేశం ప్రతిరోజూ 1 లక్ష టన్నుల వ్యర్థాలను శుద్ది చేస్తోంది. 2014 లో స్వచ్చ భారత్ ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు.. 20శాతం కంటే తక్కువ వ్యర్థాలు శుద్ది చేయబడుతుండేవి. ఈ రోజు మనం రోజువారీ వ్యర్థాలలో 70 శాతం ప్రాసెస్ చేస్తున్నాము. ఇప్పుడు మనం దానిని 100శాతంకి తీసుకెళ్లాలి అని మోదీ అన్నారు.

కాగా, స్వచ్ఛ భారత్‌ 2.0 కింద పట్టణాలకు మురుగు నుంచి విముక్తి కల్పిస్తారు. అమృత్‌ పథకం పరిధిలోకి రాని అన్ని పట్టణ ప్రాంతాల్లో మురికి నీటి నిర్వహణ చేపడతారు. అన్ని పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్‌ ప్లస్‌ (బహిరంగ మల విసర్జన రహితం)గా మారుస్తారు. లక్ష జనాభాకు పైబడిన పట్టణాలను ఓడీఎఫ్‌ ప్లస్‌ప్లస్‌గా తీర్చిదిద్దుతారు. తద్వారా పట్టణాలు స్వచ్ఛమైన ప్రాంతాలుగా మార్చే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఘన వ్యర్థాలను అవి ఉత్పత్తి అయ్యేచోటే వేరు చేయడంపై దృష్టి సారిస్తారు. వాటిని తగ్గించడం, పునర్వినియోగించడం, పునఃశుద్ధి చేయడంపై ఫోకస్ పెడతారు. మున్సిపాల్టీల్లో వెలువడే అన్నిరకాల వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధిచేసి, వాటిని సమర్థవంతంగా వినియోగిస్తారు. ఈ స్వచ్ఛభారత్‌-2.0కి కేంద్ర ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది.

ఇక,అమృత్‌ 2.0 కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఉన్న 4,700 పట్టణ స్థానిక సంస్థల్లో 2.68 కోట్ల నల్లా కనెక్షన్లు ఇచ్చి ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తారు. 500 అమృత్‌ పట్టణాల్లో ఇళ్లకు మరుగు వ్యర్థాల కనెక్షన్లు ఇస్తారు. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో ఉన్న 10.5 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. ఉపరితల, భూగర్భ జలాలను సంరక్షించడంతో పాటు, వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం ప్రపంచస్థాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్య కల్పన పురోగతిని తెలుసుకొనేందుకు తాగునీటి సర్వేకూడా చేపడతారు. ఈ మొత్తం కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.87 లక్షల కోట్లు కేటాయించింది.

ALSO READ దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు