Anti-Covid Drive: కరోనా కట్టడికి పంచసూత్రాల వ్యూహం

కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ అయింది. వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాలని ఆదేశించింది.

Anti-Covid Drive: కరోనా కట్టడికి పంచసూత్రాల వ్యూహం

Pm Narendra Modi Reviews Situation

anti-Covid drive : కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ అయింది. వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాలని ఆదేశించింది. కరోనా కట్టడిపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా 90 వేలకు పైగా కేసులు నమోదవ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. టీకా పంపిణీపై ఆరా తీశారు. రాష్ట్రాలు, జిల్లాల్లో టీకా పంపిణీ కార్యక్రమం ఎలా సాగుతోంది..? ఇప్పటి వరకు ఎంతమందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు..? ఏయే రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి ఉందనే అంశాలపై మోదీ చర్చించారు. ఏప్రిల్‌ 6 నుంచి 14 వరకు కరోనా జాగ్రత్తలు, మాస్క్‌ వాడకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని సూచించారు.

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతమవుతోన్న వేళ.. పంచ సూత్రాల అమలు వ్యూహంతోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనా నిబంధనలను ప్రజలు వందశాతం పాటించే విధంగా విస్తృత అవగాహన చేపట్టడంతో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖతో పాటు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి కృషి చేస్తోన్న ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో భేటి నిర్వహించారు ప్రధాని. ఇందులో ప్రధాని మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. వైరస్‌ ఉధృతంగా ఉన్న ఆరు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాలని సూచించారు.

ముఖ్యంగా కరోనా ఉధృతంగా మహారాష్ట్ర, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు బృందాలను అత్యవసరంగా పంపాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు.. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌, కొవిడ్‌ నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్‌ వేగం పెంచడం వంటి పంచ సూత్రాల వ్యూహాన్ని అమలు పరచాలని అధికారులకు సూచించారు నరేంద్ర మోదీ. మాస్కులు ధరించడం, భౌతిక దూరం, శానిటైజ్‌ నిబంధనలను కచ్చితంగా, నిబద్ధతతో పాటించడం వల్ల కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చని ప్రకటించారు ప్రధాని మోదీ. వీటి ప్రాధాన్యతను వివరిస్తూ ఏప్రిల్‌ 6నుంచి 14 తేదీ వరకు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులకు సూచించారు. మరోవైపు వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా ఆంక్షలు విధించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని కాస్త అదుపు చేయవచ్చని అభిప్రాయపడ్డారు అధికారులు.