మంత్రులకు కరోనా షాక్…జాగ్రత్తగా ఉండాలని మోడీ పిలుపు

  • Published By: venkaiahnaidu ,Published On : March 12, 2020 / 12:11 PM IST
మంత్రులకు కరోనా షాక్…జాగ్రత్తగా ఉండాలని మోడీ పిలుపు

కరోనా వైరస్‌ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం(మార్చి-12,2020) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజలు భయ  భ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని, తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని మోడీ ట్వీట్ ద్వారా తెలిపారు.

కరోనాను అరికట్టేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.  కరోనాను అడ్డుకోడానికి అన్ని రాష్ట్రాలకు మార్గదర్శక సూత్రాలను పంపించి, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. అందరం జాగ్రత్తగా ఉందాం.. కరోనాను తరిమేద్దామని మోడీ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రులు ఎవరూ కూడా కొన్ని రోజుల పాటు విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉంటారని మోడీ తెలిపారు.

See Also | 40 ఇయర్స్..ఇలాంటి పాలన చూడలేదు..నరరూపహంతకులు – బాబు

కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. చర్యల్లో భాగంగానే పర్యాటక వీసాలు రద్దు చేశామన్నారు. దేశ ప్రజలు కూడా అనవసరమైన విదేశీ ప్రయాణాలు మానుకోవాలని కోరుతున్నానని ప్రధాని తెలిపారు. ప్రజలేవరూ గుమిగూడవద్దని, దీంతో వైరస్‌ను అరికట్టొచ్చని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. 

See Also | కరోనా లేదు : నా పౌల్ట్రీకి రూ. 10 కోట్ల నష్టం వచ్చింది – ఈటల