Modi and Gehlot: ఒకే వేదికపై ప్రధాని మోదీ, సీఎం గెహ్లాట్.. ఒకరిపై మరొకరు పొగడ్తలు

ప్రధానమంత్రి తన ప్రసంగంలో ముఖ్యమంత్రులుగా తాను, గెహ్లాట్ కలిసి పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. ''మేము సీఎంలుగా ఉన్న సమయంలో గెహ్లాట్ సీనియర్. ఇప్పుడు వేదికపై ఉన్న సీనియర్ మోస్ట్ సీఎంలలో ఆయన ఒకరు'' అని ప్రధాని అన్నారు. దీనికి ముందు గెహ్లాట్ తన ప్రసంగంలో మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన గొప్ప గౌరవం లభిస్తోందని అన్నారు

Modi and Gehlot: ఒకే వేదికపై ప్రధాని మోదీ, సీఎం గెహ్లాట్.. ఒకరిపై మరొకరు పొగడ్తలు

PM Narendra Modi shares stage with Rajasthan CM Ashok Gehlot

Modi and Gehlot: ప్రతి రోజు ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకునే నేతలు ఒకే వేదికపైకి వచ్చినప్పుడు ఒక్కసారిగా పొగడ్తలు కురిపించుకోవడం కామన్. సమయం, సందర్భాల్ని బట్టి రాజకీయాల్లో ఇవి తప్పవు. అలాగే, రాజకీయ వైరాన్ని అన్ని సందర్భాల్లోకి లాగకూడదు. ఇది సబబే అయినప్పటికీ.. వైరమైనా, స్నేహమైనా చూపించే సమయంలో వీరావేశాలతో ఊగిపోయే నేతల్ని చూస్తేనే కాస్త విచిత్రంగా అనిపిస్తుంటుంది. దేశంలో ప్రధాన వైరి పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీ మధ్య నీళ్లు చల్లినా నిప్పులే కురిసే పరిస్థితి ఉంటుంది.

ఇరు పార్టీల నేతలు ఒక సందర్భంలో ఇక వేదికపైకి వచ్చిన సమయంలో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు గుప్పించుకుంటూనే ఉంటారు. చాలా తక్కువ సందర్భాల్లో ఇరు పార్టీల నేతల మధ్య సన్నిహిత వ్యాఖ్యలు దొర్లుతుంటాయి. ఇక విషయంలోకి వెళ్తే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఒకే వేదికను పంచుకున్నారు. రాజస్తాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‭లో జరిగిన ఓ కార్యక్రమంలో వీరు ఇలా కలుసుకున్నారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. రాజకీయ వైరాల్ని పక్కన పెట్టి తాము ఇరువురు ముఖ్యమంత్రులుగా ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ ఒకరిపై మరొకరు పొగడ్తలు కురిపించుకోవడం గమనార్హం.

ప్రధానమంత్రి తన ప్రసంగంలో ముఖ్యమంత్రులుగా తాను, గెహ్లాట్ కలిసి పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. ”మేము సీఎంలుగా ఉన్న సమయంలో గెహ్లాట్ సీనియర్. ఇప్పుడు వేదికపై ఉన్న సీనియర్ మోస్ట్ సీఎంలలో ఆయన ఒకరు” అని ప్రధాని అన్నారు. దీనికి ముందు గెహ్లాట్ తన ప్రసంగంలో మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన గొప్ప గౌరవం లభిస్తోందని అన్నారు. ”ప్రధాని మోదీ విదేశాలకు ఎప్పుడు వెళ్లినా అక్కడ విశేష గౌరవం లభిస్తోంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం బలంగా వేళ్లూనుకున్న జాతిపిత గాంధీ పుట్టిన దేశానికి ఆయన ప్రధాని. అలాంటి దేశానికి ప్రధానిగా మోదీ తమ దేశం వచ్చినందుకు అక్కడి వారంతా గర్వపడుతుంటారు” అని గెహ్లాట్ అన్నారు.

Sukesh Chandrasekhar: ఆప్ మంత్రికి రూ.10 కోట్లు, పార్టీకి రూ.50 కోట్లు ఇచ్చానని సంచలన ఆరోపణలు చేసిన సుకేశ్ చంద్రశేఖర్