PM Narendra Modi: మూడు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటు.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్న మోదీ

మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడబోతున్న సంగతి తెలిసిందే. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆధ్వర్యంలోనే కొత్త ప్రభుత్వాలు కొలువుదీరబోతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ హజరవ్వబోతున్నారు.

PM Narendra Modi: మూడు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటు.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్న మోదీ

PM Narendra Modi: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడబోతున్న సంగతి తెలిసిందే. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆధ్వర్యంలోనే కొత్త ప్రభుత్వాలు కొలువుదీరబోతున్నాయి.

Manish Sisodia: జైల్లో సిసోడియాకు వేధింపులు.. బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు.. సీబీఐపై ఆప్ ఆరోపణ

ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ హజరవ్వబోతున్నారు. ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు ధృవీకరించాయి. మోదీతోపాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఇతర బీజేపీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేతల దగ్గరి నుంచి మోదీ సహా అతిథులకు ఆహ్వానాలు అందాయి. పలువురు నేతలు ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.

Right To Pee: నాగ్‌పూర్‌లో పబ్లిక్ టాయిలెట్ల కోసం మహిళల ఉద్యమం.. ప్లకార్డులతో నిరసన

తాజా షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం (మార్చి 7) మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగుతాయి. మంగళవారం ఉదయం 11.00 గంటలకు మేఘాలయ (షిల్లాంగ్)లో కోన్రాడ్ సంగ్మా సీఎంగా ప్రమాణ చేస్తారు. అనంతరం నాగాలాండ్‌లోని కోహిమాలో మధ్యాహ్నం 01.45 గంటలకు సీఎంగా నియిఫియు రియో ప్రమాణ స్వీకారం చేస్తారు. మరుసటి రోజు బుధవారం త్రిపురలో మాణిక్ సాహా సీఎంగా ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమాలు అన్నింటికీ మోదీ హాజరవుతారు. ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి గత ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో గెలుపు ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ తన పట్టు నిలుపుకోగలిగింది. కాంగ్రెస్ మాత్రం చతికిలపడింది.