Kisan Samman Nidhi: రైతులకు గుడ్‌న్యూస్.. 13వ విడత సాయం వచ్చేస్తోంది.. రూ. 16,800 కోట్లు విడుదల చేయనున్న ప్రధాని మోదీ ..

13వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని మోదీ ఈ రోజు విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 16,800 కోట్ల సాయాన్ని అందించనున్నారు. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ. 2.25 లక్షల కోట్ల నిధులను కేంద్రం పంపిణీ చేసిన విషయం విధితమే.

Kisan Samman Nidhi: రైతులకు గుడ్‌న్యూస్.. 13వ విడత సాయం వచ్చేస్తోంది.. రూ. 16,800 కోట్లు విడుదల చేయనున్న ప్రధాని మోదీ ..

pm modi

Kisan Samman Nidhi: కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఈ రోజు వారి ఖతాల్లో నగదును జమచేస్తామని తెలిపింది. రైతులకు ప్రతీయేటా పంటలసాగు నిమిత్తం ‘ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం ద్వారా కేంద్రం ఆర్థిక సాయం అందిస్తున్న విషయం విధితమే. అర్హులైన ప్రతీఒక్క రైతుకు ఏడాదికి రూ. 6వేల చొప్పున అందిస్తుంది. వీటిని మూడు విడతల్లో రూ. 2వేల చొప్పున రైతుల ఖాతాల్లో కేంద్రం జమచేస్తుంది. ఇప్పటి వరకు 12 విడతలు అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. 13వ విడత కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులను ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు.

PM Kisan Samman Nidhi : రైతులకు ఆర్థిక సహాయం పెంచనున్నకేంద్రం .. ఎంతంటే..

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధికార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు. బెళగావిలో లక్షమందికిపైగా కిసాన్ సమ్మాన్ నిధి, జలమ్ జీవన్ మిషన్ లబ్ధిదారులతో నిర్వహించనున్న సభలో ప్రధాని పాల్గొంటారు. ఈ సందర్భంగా 13వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను మోదీ విడుదల చేస్తారు. దీంతో  దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 16,800 కోట్ల సాయాన్ని అందించనున్నారు. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ. 2.25 లక్షల కోట్ల నిధులను కేంద్రం పంపిణీ చేసిన విషయం విధితమే.

PM Kisan Samman Nidhi: 11వ విడత పీఎం కిసాన్ నిధులు మీకు అందలేదా? అయితే ఇలా చెక్ చేసుకోండి..

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అకౌంట్లో జమకాకుంటే.. అవి వచ్చాయా? లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆ వివరాలు తెలుసుకోవచ్చు. వెబ్ సైట్‌లో బెనిఫీషియరీ లిస్ట్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయడం ద్వారా రాష్ట్రం, జిల్లా, మండల వారీగా వివరాలు నమోదు చేసి అర్హులైన రైతుల వివరాలను తెలుసుకోవచ్చు. డబ్బులు రైతు ఖాతాలో జమకాకుంటే ఎందుకు జమ కాలేదో కూడా అక్కడ కారణం ఉంటుంది. దీన్ని సరిచేసుకుంటే తర్వాత సీఎం కిసాన్ డబ్బులు పొందొచ్చు.