PM Modi: తల్లి 99వ పుట్టినరోజు సందర్భంగా స్నేహితుడ్ని గుర్తు చేసుకున్న మోదీ

ప్రధాని మోదీ తన తల్లి 99వ పుట్టినరోజు సందర్భంగా చిన్నప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. 99సంవత్సరాల వయస్సున్న తల్లి హీరాబెన్ మోదీని పొగిడేస్తూ.. కుటుంబానికి ఆమె ఎంత ప్రధాన్యమిచ్చే వారో వెల్లడించారు.

PM Modi: తల్లి 99వ పుట్టినరోజు సందర్భంగా స్నేహితుడ్ని గుర్తు చేసుకున్న మోదీ

Pm Modi Mother 100th Birthday

PM Modi: ప్రధాని మోదీ తన తల్లి 99వ పుట్టినరోజు సందర్భంగా చిన్నప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. 99సంవత్సరాల వయస్సున్న తల్లి హీరాబెన్ మోదీని పొగిడేస్తూ.. కుటుంబానికి ఆమె ఎంత ప్రాధాన్యమిచ్చే వారో వెల్లడించారు. ఇతరుల ఆనందం చూసి సంతోషించడం ఎంత ముఖ్యమో ఆమెను చూసే నేర్చుకున్నానని అంటున్నారు.

తన తండ్రి స్నేహితుడు చనిపోయాక.. అతని కొడుకును తమ ఇంటికే తీసుకొచ్చి చదివించిన సంగతి గుర్తు చేసుకున్నారు.

“ఇతరుల ఆనందంలో అమ్మ సంతోషం వెతుక్కునేది. మా ఇల్లు చిన్నదే కావొచ్చు. కానీ, ఆమె మనస్సు పెద్దది. నా తండ్రి సన్నిహితుడు ఒకరు చనిపోవడంతో అతని కొడుకు అబ్బాస్ ను ఇంటికి తీసుకొచ్చారు. మాతోనే కలిసి ఉండేవాడని, అలా చదువును కూడా పూర్తి చేశాడ”ని వివరించారు.

Read Also: యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ: మోదీ

“మా అమ్మ అబ్బాస్ ను కూడా నా తోబుట్టువులతో సమానంగా చూసేది. ప్రతిపండగకు అతనికి నచ్చిన వంటలు చేసేది. ఆ సమయంలో చుట్టువైపుల నుంచి పిల్లలు వచ్చి అమ్మ చేసిన ప్రత్యేక వంటకాలు తినేవారు. ఎప్పుడైనా ఇంటివైపుగా సాధువులు వచ్చినా.. వారికి పిలిచి భోజనం పెట్టేది. ఆమె నిస్వార్థమైన గుణం నిజమైనది. ఆమె గురించి అడగకుండా తన పిల్లలను మాత్రం ఆశీర్వదిస్తే చాలనుకునేది” అని గాంధీనగర్ లో 99వ పుట్టిన రోజు సందర్భంగా కలిసిన మోదీ వివరించారు.

ఈ సందర్భంగా జరిగిన ఫ్యామిలీ మీటింగ్ లో మోదీ తన తల్లి కాళ్లను కడిగి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోలు వైరల్ అయ్యాయి.

అక్టోబర్ 2017లో మోదీ తన స్వగ్రామానికి 2014 తర్వాత తొలి సారి ప్రధానిగా రావడంతో అంతే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈస్ట్ గుజరాత్ రైల్వే స్టేషన్ లో తన తండ్రి ఛాయ్ అమ్మిన ప్రాంతం అది. ఆ తర్వాత రైల్వే స్టేషన్ ను చక్కగా తీర్చిదిద్దడంతో పాటు, ఆ టీ అమ్మే ప్లేస్ ను కూడా రెనోవేషన్ చేయించారు.