పెరుగుతున్న కరోనా కేసులు..అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ సమావేశం!

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో బుధవారం ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.

పెరుగుతున్న కరోనా కేసులు..అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ సమావేశం!

Pm To Meet All Cm’s

PM To Meet All CM’s దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో బుధవారం ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. బుధవారం(మార్చి-17,2021)మధ్యాహ్నాం 12:30గంటలకు వర్చువల్ గా ప్రధాని..రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై పెరుగుతున్న కరోనా కేసులు,కరోనా నియంత్రణ చర్యలు,వ్యాక్సినేషన్ కార్యక్రమంపై వారితో చర్చించనున్నారని సమాచారం.

గడిచిన కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 10వేల కోవిడ్ కేసులు దేశంలో నమోదవగా..ఇవాళ(మార్చి-15,2021)26,291కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 85 రోజుల్లో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఇక,కోవిడ్ మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో మరణించిన 118మందితో కలుపుకొని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్ తో 1,58,725మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 2,19,262 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో ఇది 1.93శాతం. ఇక,రికవరీ రేటు 96.68శాతానికి పడిపోయింది.

ఇక,ఎక్కువగా కరోనా కేసులు,మరణాలు ఒక్క మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో 15వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో మహారాష్ట్రలో 15,051కొత్త కరోనా కేసులు,48మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కరోనా కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలో 1,30,247యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 52,909మంది కోవిడ్ తో మరణించడం ఆందోళనకర విషయం.

మరోవైపు,దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.15కోట్ల మంది కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు కేంద్రఆరోగ్యశాఖ సోమవారం ప్రకటించింది.