ప్రభుత్వాలను కూల్చటంలో బిజీగా ఉన్నబీజేపీ పెట్రోల్ ధరలు తగ్గటం గమనించలేదేమో 

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 06:44 AM IST
ప్రభుత్వాలను కూల్చటంలో బిజీగా ఉన్నబీజేపీ పెట్రోల్ ధరలు తగ్గటం గమనించలేదేమో 

ప్రధాని మోడీ కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్ వేదికగా బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచి..కూల్చేటంపై బీజేపీ దృష్టి పెట్టి బిజీ బిజీగా ఉందనీ..ఈ క్రమంలో 35 శాతం తగ్గిన పెట్రోల్ ధరలకు గురించి గమనించలేదేమో నని సెటైర్లు వేశారు. 

పెట్రోల్ ధరను రూ.62లకు తగ్గించటం ద్వారా ప్రజాప్రయోజనాల ప్రజలకు ప్రజాప్రయోజనాన్ని అందించగలరా అంటూ ప్రశ్నించారు. పెట్రోల్ ధరలు తగ్గటం నిలిచిపోయిన ఆర్థిక వ్యవస్థను మెరుగు పడటానికి బీజేపీ దృష్టి పెడితే బాగుంటుందంటూ సూచించారు. 

కాగా..మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరించేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. సీఎం కమల్ నాథ్ పై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్యసింధియా కాంగ్రెస్ పార్టీకి గుడ్ చెప్పేసి 20మంది ఎమ్మెల్యేలతో బైటకొచ్చేశారు. తరువాత కేంద్ర మంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని మోడీని కలిసారు. తరువాత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేశారు.

ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరుతాన్నట్లుగా రాజకీయవాతావరణం ఉంది. మధ్యప్రదేశ్ లో రాజకీయ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ సింధియాను తనవైపుగా తిప్పుకుంది. బీజేపీలో చేరితే కేంద్ర మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చానట్లుగా తెలుస్తోంది. దీంతో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం కూల్చేయటానికి బీజేపీ కాచుకుని కూర్చుంది. జ్యోతిరాదిత్య సింధియాను బీజేపీలోకి చేర్చుకుని ఆయన 20మంది ఎమ్మెల్యేలతో మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి పధకాలు వేస్తోంది. 

ఈ క్రమంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీ కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్ వేదికగా బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచి..కూల్చేటంపై బీజేపీ దృష్టి పెట్టి బిజీ బిజీగా ఉందనీ..ఈ క్రమంలో 35 శాతం తగ్గిన పెట్రోల్ ధరలకు గురించి గమనించలేదేమో నని సెటైర్లు వేశారు.