మోడీ మళ్లీ ప్రధాని ఖాయం : PMOలో “ప్లాన్ ఆఫ్ యాక్షన్”రెడీ

మోడీ మళ్లీ ప్రధాని ఖాయం : PMOలో “ప్లాన్ ఆఫ్ యాక్షన్”రెడీ

దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలు మే-23కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.ఎందుకంటే మళ్లీ ఐదేళ్ల వరకు ఇలాంటి రోజు రాదని.రాజకీయ పార్టీలు,నాయకులు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా ఎంతో ఆశక్తిగా ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.ఎవరు అధికార పక్షంలో ఉంటారు,ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారనేది ఆ రోజు తేలిపోనుంది. అయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్(PMO) మాత్రం ఎవరు గెలిచేది తమకు ఇప్పటికే తెలిసిపోయిందంటోంది.మరోసారి బీజేపీదే అధికారం అని పీఎంవో అధికారులు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు.

అంతటితో ఆగకుండా బీజేపీ మేనిఫెస్టోలోని అంశాల ఆధారంగా కొత్త ప్రభుత్వపు మొదటి 100రోజుల “ఫ్లాన్ ఆఫ్ యాక్షన్” సిద్దం చెయ్యాలని వివిధ మంత్రిత్వ శాఖల డిపార్ట్ మెంట్ హెడ్ లకు పీఎంవో ఆదేశాలు జారీ చేసింది.అంతేకాకుండా కొత్త ప్రభుత్వం కోసం పరిపాలన అజెండా సెట్ చేసేందుకు “ట్రాన్స్ ఫర్మేషనల్ ఐడియాస్”ఫై ప్రతీ డిపార్ట్ మెంట్ సెక్రటరీకి పీఎంవో ముందు ప్రజంటేషన్ చెయ్యాలని ఓ డేట్ ని కేటాయించింది. ఇద్దరు సెక్రటరీలు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.