రేప్ కేసులో 22రోజుల్లోనే తీర్పు.. తుది శ్వాస వరకూ జైళ్లోనే

రేప్ కేసులో 22రోజుల్లోనే తీర్పు.. తుది శ్వాస వరకూ జైళ్లోనే

ఉత్తరప్రదేశ్ లోని POCSO Court 22రోజుల్లో తీర్పు ఇచ్చి శభాష్ అనిపించుకుంది. ఆరేళ్ల బాలికను రేప్ చేసిన కేసు విచారణలో భాగంగా స్పెషల్ జడ్జి వీణా నారాయణ్ వాదనలు విన్నారు. దల్పత్ అనే వ్యక్తికి రూ.2లక్షల జరిమానా విధిస్తూ జీవిత ఖైదు విధించింది.

‘పొక్సో చట్టం సెక్షన్ 6 ప్రకారం.. నిందితుడు తుది శ్వాస విడిచే వరకూ జీవిత ఖైదు అనుభవించాల్సిందే’ అని జడ్జిమెంట్ ఇచ్చారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరేంద్ర త్యాగి వాదనలో దోషిగా తేలడంతో 22రోజుల్లోనే శిక్షను విధిస్తూ.. తీర్పు ఇచ్చేశారు.ఆంరోహా జిల్లాకు చెందిన వ్యక్తి ఆగష్టు 6న ఆరేళ్ల బాలికను రేప్ చేయడంతో పాటు దారుణంగా హింసించాడు. ’12గంటల పాటు వెదికిన తర్వాత ఆగష్టు 7న బాలిక కనిపించింది. స్పృహలో లేని స్థితిలో రక్తస్రావంలో ఉంది. దల్పత్ ను ఆగష్టు 14న ఆంరోహలో అరెస్టు చేశారు.

బాధితురాలు పలు గాయాలతో పాటు అంతర్గత అవయవాలు కూడా పాడైయ్యాయని మీరట్ హాస్పిటల్ లో చెపపారు. నాలుగు రోజుల్లో కోర్టు విధించిన రెండో శిక్ష ఇది. అక్టోబరు 15న ఇద్దరు దోషులకు 2018వ సంవత్సరంలో 12ఏళ్ల బాలికను రేప్ చేసిన కేసులో మరణశిక్ష విధించింది.

ప్రొసిక్యూషన్ జరిగేందుకు అన్ని రకాలుగా శ్రమించాం. సాక్ష్యులను ప్రవేశపెట్టి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేశాం. ఇంత త్వరగా జడ్జిమెంట్ వచ్చినందుకు సంతోషంగా ఫీలవుతున్నాం’ అని అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) సర్వేశ్ మిశ్రా అన్నారు.