న్యూ ఇయర్ : ఇంట్లో 85 లీటర్ల మద్యం, 61 ఏళ్ల వ్యక్తి అరెస్టు

న్యూ ఇయర్ : ఇంట్లో 85 లీటర్ల మద్యం, 61 ఏళ్ల వ్యక్తి అరెస్టు

‘illegally storing’ 85 litres of alcohol at home : నూతన సంవత్సరం సందర్భంగా ఇంట్లో 85 లీటర్ల మద్యం నిల్వ చేసినందుకు 61 సంవత్సరాల వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 114 సీసాల్లో మద్యం నిల్వ చేశాడని పోలీసులు తెలిపారు. బెంగళూరు నగరంలోని రాజాజీనగర్ లో వెస్ట్ ఆఫ్ కార్డ్ రోడ్ లో నివాసం ఉండే ఇతను..Mekhri Circle లోని వైమానిక దళం క్యాంటీన్ నుంచి లిక్కర్ ను కొనుగోలు చేసినట్లు, అయినా..అతను ఎలాంటి బిల్లు, రికార్డులు ఇవ్వలేదని బసవేశ్వరనగర్ పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు.

నిందితుడి నివాసంలో జరిపిన సోదాల్లో మగడి రోడ్ పోలీస్ స్టేషన్ (Magadi Road police station) పోలీసులు పాల్గొన్నారని తెలిపారు. ఓ వ్యక్తి ఇంట్లో నాలుగు లీటర్ల మద్యం నిల్వ చేసుకొనే అవకాశం ఉందని, కానీ ఇతను 20 రెట్లు అక్రమంగా నిల్వ చేయడంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కర్నాటక ఎక్సైజ్ చట్టం సెక్షన్ 34 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. నిల్వ చేసేందుకు మద్యం సీసాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దానిపై ఆరా తీస్తున్నామని మరో పోలీసు అధికారి తెలిపారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో నగరంలో ఓ మద్యం దుకాణదారుడు ఒకే వినియోగదారుడికి 52 వేల 841 రూపాయల విలువైన మద్యం విక్రయించాడనే కేసు నమోదైందని, కరోనా నేపథ్యంలో…ఓ వ్యక్తి వద్ద 2.3 లీటర్ల (IMFL) లేదా 18.2 లీటర్ల బీరు మాత్రమే అనుమతి ఉంది. కానీ..ఆ దుకాణదారు. 17.4 లీటర్ల (IMFL), 35.7 లీటర్ల బీరును విక్రయించాడని తెలిపారు.