Athletics Coach Sexually Assaulting : మహిళా అథ్లెటిక్ కోచ్ పై లైంగిక వేధింపులు.. మంత్రిపై కేసు నమోదు

మహిళా అథ్లెటిక్స్ కోచ్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై హర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ పై కేసు నమోదు అయింది. మరోవైపు అథ్లెటిక్ కోచ్ తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని మంత్రి అన్నారు.

Athletics Coach Sexually Assaulting : మహిళా అథ్లెటిక్ కోచ్ పై లైంగిక వేధింపులు.. మంత్రిపై కేసు నమోదు

POLICE CASE

Athletics Coach Sexually Assaulting : మహిళా అథ్లెటిక్స్ కోచ్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై హర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ పై కేసు నమోదు అయింది. సందీప్ సింగ్ జాతీయ హాకీ జట్టు కెప్టెన్ గా వ్యవహరిండంతో పాటు ఒలంపిక్స్ లోనూ పాల్గొన్నారు. కురుక్షేత్రలోని పెహోవా బీజేపీ ఎమ్మెల్యే అయిన సింగ్ తనను మొదట జిమ్ లో చూశారని ఆపై ఇన్ స్టాగ్రాం లో పరిచయం పెంచుకున్నాడని మహిళా అథ్లెటిక్ కోచ్ తెలిపారు.  ఇన్ స్టాలో తనతో పరిచయం పెంచుకున్న మంత్రి.. తనను కలుసుకోవాలని ఒత్తిడి చేశాడని ఆరోపించారు.

తన నేషనల్ గేమ్స్ సర్టిఫికేట్ పెండింగ్ లో ఉందని, ఈ విషయమై తనను కలవాలని కోరినట్లు చెప్పారు. దురదృష్టవశాత్తూ ఫెడరేషన్ లో తన సర్టిఫికెట్ గల్లంతు కాగా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లానని బాధిత మహిళ తెలిపారు. చివరకు తాను మంత్రి దగ్గరకు డాక్యుమెంట్లతో వెళ్లానని.. ఈ క్రమంలో సందీప్ సింగ్ తన పట్ల అభ్యంతరకరంగా వ్యవహరిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.

Amala Paul: తన మాజీ ప్రియుడు లైంగిక వేధింపులు చేస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించిన అమలా పాల్

మరోవైపు అథ్లెటిక్ కోచ్ తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని మంత్రి అన్నారు. మంత్రిపై ఆరోపణలు రావడంతో ఈ అంశంపై దర్యాప్తు చేపట్టేందుకు హర్యానా ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేసింది. కాగా ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.