పోలీసుల వార్నింగ్ : ఆ క్రాకర్స్ కాలిస్తే జైలుకే

దీపావళి వచ్చేస్తోంది. దీపావళి అంటేనే క్రాకర్స్ పండగ. బాణాసంచా కాల్చేందుకు చిన్న, పెద్ద రెడీ అవుతున్నారు. రకరకాల టపాసులు కొనుగోలు చేసే పనిలో ఉన్నారు. అయితే.. నాన్

  • Published By: veegamteam ,Published On : October 21, 2019 / 10:53 AM IST
పోలీసుల వార్నింగ్ : ఆ క్రాకర్స్ కాలిస్తే జైలుకే

దీపావళి వచ్చేస్తోంది. దీపావళి అంటేనే క్రాకర్స్ పండగ. బాణాసంచా కాల్చేందుకు చిన్న, పెద్ద రెడీ అవుతున్నారు. రకరకాల టపాసులు కొనుగోలు చేసే పనిలో ఉన్నారు. అయితే.. నాన్

దీపావళి వచ్చేస్తోంది. దీపావళి అంటేనే క్రాకర్స్ పండగ. బాణాసంచా కాల్చేందుకు చిన్న, పెద్ద రెడీ అవుతున్నారు. రకరకాల టపాసులు కొనుగోలు చేసే పనిలో ఉన్నారు. అయితే.. నాన్ గ్రీన్ టపాసుల జోలికి మాత్రం వెళ్లకండి. ఎందుకంటే.. నాన్ గ్రీన్ టపాసులు కాలిస్తే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. కాల్చిన వారినే కాదు నాన్ గ్రీన్ టపాసులు విక్రయించినవారిపైనా చర్యలు తప్పవని ఢిల్లీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

2018లో దీపావళికి ముందు సుప్రీంకోర్టు… ఢిల్లీ-ఎన్సీఆర్‌లలో నాన్ గ్రీన్ టపాసులు విక్రయం, కాల్చడంపై నిషేధం విధించింది. దీనిని ఉల్లంఘిస్తూ టపాసులు కాల్చినా, విక్రయించినా సదరు వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. దోషిగా తేలిన వారికి 6 నెలల జైలు లేదా జరిమానా లేదా ఈ రెండింటినీ విధించే అవకాశముంది.

దీపావళి సందర్భంగా పోలీసులు మరోమారు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నాన్ గ్రీన్ టపాసులపై నిషేధం విధించిన తర్వాత దీనిని పట్టించుకోనివారిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. గ్రీన్ టపాసుల వలన సాధారణ టపాసుల కన్నా 30 నుంచి 50 శాతం తక్కువగా కాలుష్యం వెలువడుతుంది. ఈ నిర్ణయం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తే మరికొందరు వ్యతిరేకత తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని ప్రకృతి ప్రేమికులు పిలుపునిచ్చారు. నిబంధనలను పాటిస్తే ప్రకృతికి మంచి చేసిన వారం అవుతామన్నారు. అదే సమయంలో ఇలాంటి నిబంధనలు కరెక్ట్ కాదనే వారూ లేకపోలేదు. అటు బాణాసంచా వ్యాపారం చేసే వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సేల్స్ పడిపోయాయని, తాము నష్టపోతున్నామని వాపోయారు.

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యపు కోరల్లో చిక్కుకుంది. సౌండ్, ఎయిర్ పొల్యూషన్ బాగా పెరిగాయి. పొల్యూషన్ కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీపావళి సమయంలో క్రాకర్స్ కాల్చడం ద్వారా సౌండ్, ఎయిర్ పొల్యూషన్ లెవల్స్ బాగా పెరుగుతున్నాయని వాపోతున్నారు.