Varanasi Police : ‘నో పార్క్ జోన్‌’లో కారు నిలిపిన వ్యక్తికి దండేసి మరీ ఫైన్ కట్టించిన పోలీస్

ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించడానికి పోలీసుల రకరకాల కార్యక్రమాలు చేపడుతుంటారు. అయినా కొందరి చెవికెక్కితేగా? .. రోడ్డుకి అడ్డంగా కారు నిలిపిన వ్యక్తికి ఓ పోలీసాయన ఎలా బుద్ధి చెప్పాడో చదవండి.

Varanasi Police : ‘నో పార్క్ జోన్‌’లో కారు నిలిపిన వ్యక్తికి దండేసి మరీ ఫైన్ కట్టించిన పోలీస్

Varanasi Police

Varanasi Police : పోలీసులు రూల్స్ అతిక్రమిస్తే చలాన్లు (challan) వేయడం కామనే.. వారణాసిలో(varanasi) ఒకతను ‘నో పార్కింగ్ జోన్’ (No parking zone) అని ఉన్నచోట కారు పార్క్ చేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో మీరే చదవండి.

bull attack : మహిళపై ఎద్దు దాడి.. ప్రాణాలకు తెగించి కాపాడిన బాలుడి వీడియో వైరల్

హెల్మెట్ (helmet) లేకపోయినా, ట్రాఫిక్ రూల్స్ అధిగమించినా, పోలీసులు జరిమానాలు (fine) విధించడం మామూలే. వారణాశిలో ఓ పోలీసాయన ఇచ్చిన పనిష్మెంట్ మాత్రం భలేగా ఉంది. ఓ యువకుడు నో పార్కింగ్ జోన్ లో తన కారుని పార్క్ చేశాడు. ఎక్కడ అనుకునేరు రోడ్డుకి మధ్యలో ఇక జనాలకి ఇబ్బంది కలిగితే ఏం చేస్తారు. వెంటనే ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో కాస్త ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ (traffic inspector) అనురాగ్ త్యాగి (anurag tyagi) కంటపడింది. వెంటనే అక్కడికి చేరుకుని ఆ యువకుడి మెడలో పూల దండ వేసారు. అక్కడ చూస్తున్నవారంతా చప్పట్లు కొట్టారు. ఇక అతని నుంచి 2,500 రూపాయలు చలాను వసూలు చేశారు. ఇక తప్పేది లేక ఆ యువకుడు ఫైన్ కట్టి వెళ్లిపోయాడు.

Mango-Poori Combination : పాతదే కొత్తగా.. మ్యాంగో జ్యూస్-పూరీ.. వైరల్ అవుతున్న ఫుడ్ కాంబినేషన్

ఇంకెవరూ ఇలా చేయకుండా అవగాహన కల్పించడం కోసమే ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అనురాగ్ త్యాగి ఈ పని చేశారు. విషయం అర్ధం చేసుకున్న స్ధానికులు ఆయనను అభినందించారు.