Rape Case: అత్యాచార కేసు నిందితులపై పోలీసుల కాల్పులు

అత్యాచారం కేసులో పట్టుబడిన నిందితులు తప్పించుకునేందుకు ప్రయతించగా పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరికీ బులెట్ గాయాలయ్యాయి. కర్ణాటకలో మహిళపై అత్యాచారం కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.

Rape Case: అత్యాచార కేసు నిందితులపై పోలీసుల కాల్పులు

Rape Case

Rape Case: అత్యాచారం కేసులో పట్టుబడిన నిందితులు తప్పించుకునేందుకు ప్రయతించగా పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరికీ బులెట్ గాయాలయ్యాయి. కర్ణాటకలో మహిళపై అత్యాచారం కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో క్రైమ్ సీన్ రీ క్రియేట్ చేస్తుండగా నిందితుల్లోని ఇద్దరు పారిపోయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి.

దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటన వివరాలను బెంగళూరు ఈస్ట్ డీఎస్పీ శ్రణప్ప తెలిపారు. ఈ కేసు వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేసింది. ఓ మహిళను అత్యంత కిరాతకంగా హింసిస్తూ ఆ దృశ్యాలను వీడియో తీశారు ఎనిమిది మంది వ్యక్తులు, వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అది లీక్ అవడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు మహిళలతోపాటు ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులను ప్రశ్నించిన పోలీసులు వారు చెప్పిన వివరాలను మీడియాకు తెలిపారు. వీరంతా ఒక గ్రూపుకు చెందిన వారని, బంగ్లాదేశ్‌ నుండి వలస వచ్చారని, ఆర్థిక లావాదేవీల విషయంలో వీరి మధ్య గొడవ రావడంతో సదరు బాధితురాలిపై దాడికి కారణమైందని భావిస్తున్నామన్నారు. బాధితురాలు కూడా బాంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినట్లు పోలీసులు తెలిపారు.