Police Combing: అడవుల్లో పోలీసులు తనిఖీ.. పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం

కమాండర్ దివాకర్ అలియాస్ కిషన్, కమాండర్ దేవి అలియాస్ లక్ష్మి ఇద్దరూ మే 9 న పోలీసుల ముందు లొంగిపోయారని కవర్ధ ఎస్పీ శాలబ్ కుమార్ తెలిపారు. వీరికి పునరావాసం కల్పిస్తామని ఎస్పీ సిన్హా అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను అన్ని విధాలా సమయం అందిస్తామని ఎస్పీ వివరించారు.

Police Combing: అడవుల్లో పోలీసులు తనిఖీ.. పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం

Police Combing

Police Combing: ఛత్తీస్‌గఢ్ లో మావోస్టులకు సంబందించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి. కబీర్ధామ్ జిల్లా, కవార్ధ పట్టణ పోలీసులు మావోయిస్టులు అడవుల్లో దాచిన మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్దాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో టిఫిన్ బాంబులు, మావోయిస్టుల యూనిఫామ్స్, నక్సల్స్ సాహిత్యం, ఆహారవస్తువు, వాకీ – టాకీలు, బాంబులు పేల్చేందుకు ఉపయోగించే బ్యాటరీలు, సోలార్ ప్యానెల్లు, మందుల తోపాటు రూ.10 లక్షల నగదు ఉంది. వీటిని అడవిలో వివిధ ప్రాంతాల్లో దాచారని పోలీసులు తెలిపారు.

ఇక ప్రస్తుతం భోరమ్‌దేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ తనిఖీలపై పోలీసులు మీడియాతో మాట్లాడారు.. ఈ ఆపరేషన్ లో తమకు ఇద్దరు మాజీ మావోయిస్టులు సహకరించినట్లు తెలిపారు. కమాండర్ దివాకర్, అలియాస్ కిసాన్, కమాండర్ దేవి అలియాస్ లక్ష్మి ఇద్దరు మావోయిస్టులు మే 9న పోలీసుల ముందు లోగిపోయారు. ఇప్పుడు పోలీసులు చేస్తున్న తనిఖీలకు వీరు సహకరిస్తున్నారు. ఎక్కడెక్కడ ఆయుధ స్థావరాలు ఉన్నాయనే విషయాలను పోలీసులతో పంచుకున్నారు ఈ ఇద్దరు మాజీ మావోయిస్టులు.