లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న ప్రేమ జంటకు పోలీసుల అండ

వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కులాలు అడ్డంకిగా మారాయి. పెద్దలు వారి ప్రేమ పెళ్లికి నో చెప్పారు. దీంతో

  • Published By: veegamteam ,Published On : April 21, 2020 / 05:05 AM IST
లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న ప్రేమ జంటకు పోలీసుల అండ

వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కులాలు అడ్డంకిగా మారాయి. పెద్దలు వారి ప్రేమ పెళ్లికి నో చెప్పారు. దీంతో

వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కులాలు అడ్డంకిగా మారాయి. పెద్దలు వారి ప్రేమ పెళ్లికి నో చెప్పారు. దీంతో వారిద్దరూ ధైర్యం చేశారు. లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ ప్రేమ జంటకు అండగా నిలిచారు. ఇరు కుటుంబాల్లోని పెద్దలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కులాలు ముఖ్యం కాదని నచ్చ చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి ప్రేమికులను ఒక్కటి చేశారు.

తమిళనాడులో ఈ ఘటన జరిగింది. తిరుచ్చిలో 144 సెక్షన్‌ అమలులో ఉండగా ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన కాలేజీ విద్యార్థిని ప్రియుడి దగ్గరికి చేరుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అతడి పేరు వినోద్(25). తిరుచ్చి చింతామణి గాంధీ నగర్‌ వాసి. ఐటీఐ పూర్తి చేసిన ఇతను తిరుచ్చి అరియమంగళంలో బస్సు, లారీలకు బాడీ తయారు చేసే షెడ్‌లో పని చేస్తున్నాడు. అమ్మాయి పేరు జీవిత(20). తిరుచ్చి మదురై రోడ్డు జీవానగర్‌ నివాసి. తిరుచ్చి సత్రం బస్టాండ్‌ దగ్గర ఉన్న ప్రైవేటు కాలేజీలో బీఎస్‌సీ థర్డియర్ చదువుతోంది.

జీవిత తన కాలేజీ సమీపంలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లేది. అక్కడే వినోద్‌ పరిచయం అయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో ఇద్దరి కుటుంబీకుల్లో వీరి ప్రేమకు వ్యతిరేకత వెల్లడైంది. లాక్ డౌన్ లేని సమయంలో ఇద్దరూ ఒకరినొకరు కలుసుకునే వారు. లాక్ డౌన్ తో అన్నీ బంద్ అయ్యాయి. ఒకరినొకరు చూసుకోవడం కష్టంగా మారింది. ఎడబాటు తట్టుకోలేక పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకుని వివాహమం చేసుకున్నారు. అయితే కుటుంబసభ్యుల భయంతో పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కుటుంబసభ్యులకు నచ్చ చెప్పడంతో ఈ ప్రేమికుల కథ సుఖాంతమైంది.