Police officer: కొవిడ్‌పై పోరాటంలో అవగాహన కల్పిస్తూ పాటలు పాడుతున్న పోలీస్

మదురైకి చెందిన మతిచియాం అనే పోలీస్ ఆఫీసర్, జానపద గాయకుడు కొవిడ్ పై అవగాహన కల్పిస్తూ పాడుతున్నాడు. కొవిడ్-19 వైరస్ గురించి విజయ సేతుపతి

Police officer: కొవిడ్‌పై పోరాటంలో అవగాహన కల్పిస్తూ పాటలు పాడుతున్న పోలీస్

Police Officer

Police officer: మదురైకి చెందిన మతిచియాం అనే పోలీస్ ఆఫీసర్, జానపద గాయకుడు కొవిడ్ పై అవగాహన కల్పిస్తూ పాడుతున్నాడు. కొవిడ్-19 వైరస్ గురించి విజయ సేతుపతి నటించిన ధర్మ దురైలోని మక్క కలంగుతప్ప పాట పాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పోలీస్ అధికారులు లాక్‌డౌన్ వయోలెట్ చేసిన వారిని ముందుగా ఆపేశారు. ఆ తర్వాత కొవిడ్ పై అవగాహన కల్పిస్తూ పాట పాడారు బాలా. ఆ లిరిక్స్ లో కొవిడ్-19 దేశమంతా విషంలా వ్యాపిస్తుంది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి. స్థానికులు ఇంట్లోనే ఉండి అవసరం లేకుండా బయటకు తిరగకూడదు.

పలు కారణాలతో చనిపోయిన వారి మృతదేహాల అంత్యక్రియలు పూర్తి చేయడానికి క్యూలో నిల్చొంటున్నారు. వీటన్నింటినీ ప్రమాదకర పరిస్థితులుగా అభివర్ణిస్తూ వ్యాక్సిన్ వేయించుకోవాలని అడిగాడు. పోలీసులు అంతా వ్యాక్సినేషన్ చేయించుకుని సేఫ్ గా ఉన్నారని అన్నారు.

ప్లీజ్ భయపడకండి. వ్యాక్సిన్ వేయించుకోండి అంతా సేఫ్ గా ఉందాం. అని పాడుతున్నాడు.

తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. మే 17న 33వేల కేసులు నమోదయ్యాయి. మదురై జిల్లాలో వెయ్యి 288కేసులు నమోదుకాగా, ఇళ్లలో 9వేల 833మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.