Weekend Curfew : పెళ్లి చేసుకొనేందుకు వెళుతున్నా..వదిలేయండి..సార్, వరుడి రిక్వెస్ట్

Weekend Curfew : పెళ్లి చేసుకొనేందుకు వెళుతున్నా..వదిలేయండి..సార్, వరుడి రిక్వెస్ట్

Karnataka

Bride Groom : సార్ పెళ్లి చేసుకొనేందుకు వెళుతున్నా..నన్ను వదిలేయండి సార్..అంటూ ఓ వరుడు పోలీసులను రిక్వెస్ట్ చేశాడు. సమయానికి ఏ వాహనం దొరకలేదు..అందుకే నా ఫ్రెండ్ బైక్ పై వెళుతున్నా..నన్ను వదిలేస్తే..పెళ్లి చేసుకుంటా..అంటూ..ఆ వరుడికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. కరోనా కారణంగా..అక్కడ వారాంతపు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.

కరోనా టైంలో కర్నాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటోంది. వీకెండ్ లో కర్ఫ్యూ విధించింది. దీని వల్ల కరోనా ఛైన్ ను తెంచే అవకాశం ఉందని, కేసులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే..ఆదివారం ఉదయం మాగడి రోడ్డులో 10.30 గంటలకు ఓ బైక్ పై ఇద్దరు వెళుతున్నారు. అక్కడనే ఉన్న పోలీసులు వారిని ఆపారు. ఎక్కడకు వెళుతున్నారు? అంటూ ప్రశ్నించారు. తన పెళ్లి ఉందని, అందుకు వెళుతున్నట్లు బైక్ పై వెనుక ఉన్న వ్యక్తి చెప్పాడు. తప్పించుకోవడానికి ఏదో వంక చెబుతున్నారా అంటూ పోలీసులు గదమాయించారు.

నిజంగానే..తన పెళ్లి ఉందని, సమయానికి ఏ వాహనం దొరకపోవడంతో..తన స్నేహితుడి బైక్ పై వెళుతున్నట్లు మరోసారి చెప్పాడు. పెళ్లంటూ..ఎందుకు అబద్దం చెబుతున్నావంటూ..పోలీసులు గట్టిగా నిలదీయడంతో..జేబులో ఉన్న పెళ్లి కార్డును తీసి చూపించాడు. కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుందామని అనుకున్నా..సాధ్యం కాలేదని..అందుకే స్థానికంగా ఉన్న దేవాలయంలో పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. వధువు, ఆమె కుటుంబసభ్యులు..తన తల్లిదండ్రులు అక్కడకు చేరుకున్నారని తెలిపాడు. వదిలేస్తే..ముహూర్తం సమయానికి పెళ్లి చేసుకుంటానని కోరాడు. ఆ యువకుడు చెప్పింది నిజమేనని తెలుసుకున్న తర్వాత..అతడిని విడిచిపెట్టారు. యువకుడికి పెళ్లికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.

Read More : ఆక్సిజన్ ఉత్పత్తి కోసం తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్లాంట్ రీ ఓపెన్