Supreme Court : సెక్స్‌ వర్కర్లను వేధించొద్దు.. మీడియా, పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం!

Supreme Court : స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదంటూ దేశ సర్వన్నోత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. సెక్స్ వర్కర్లను ఏవిధంగానూ కూడా వేధించరాదని పోలీసులు, మీడియాను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Supreme Court : సెక్స్‌ వర్కర్లను వేధించొద్దు.. మీడియా, పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం!

Police Should Treat All Sex Workers With Dignity And Should Not Abuse Them Supreme Court

Supreme Court : స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదంటూ దేశ సర్వన్నోత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. సెక్స్ వర్కర్లను ఏవిధంగానూ కూడా వేధించరాదని పోలీసులు, మీడియాను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు, మీడియా పబ్లిషర్లకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెక్స్ వర్కర్ల వ్యభిచారాలపై దాడులు జరిపిన సమయంలో పట్టుబడిన సెక్స్‌ వర్కర్ల ఫొటోలను ఎట్టిపరిస్థితుల్లోనూ మీడియా టెలిక్యాస్ట్ చేయరాదని సుప్రీం స్పష్టం చేసింది. అందరిలానే.. సెక్స్ వర్కర్లకు కూడా కనీస గౌరవ మర్యాదలు ఇవ్వాలని సూచించింది.

సెక్స్ వర్కర్లపై భౌతికంగా గానీ మాటలతో వేధించడం గానీ చేయరాదని సూచించింది. వారిపట్ల పోలీసులు కనీస మర్యాదగా ఉండాలంటూ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఏ మీడియా లేదా పబ్లిషర్లు వారి ఫొటోలు ప్రచురించినా గుర్తింపును వెల్లడించినా ఐపీసీ 354C ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

Police Should Treat All Sex Workers With Dignity And Should Not Abuse Them Supreme Court (1)

Police Should Treat All Sex Workers With Dignity And Should Not Abuse Them Supreme Court

దీనికి సంబంధించి ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తగిన మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్టికల్‌ 142 ఆధారంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఉత్తర్వులను ఇచ్చింది. సెక్స్‌ వర్కర్లకు సంబంధించి నియమించిన కమిటీ ఇచ్చిన కీలక సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించింది. సెక్స్ వర్కర్లకు సంబంధించి సిఫార్సులపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని సుప్రీం ఆదేశాల్లో పేర్కొంది.

సుప్రీం నియమించిన కమిటీ సిఫార్సులు..
– స్వచ్ఛంద వ్యభిచారం నేరం కానే కాదని సుప్రీం అభిప్రాయపడింది.
– వ్యభిచార గృహాలను నిర్వహించడం చట్ట విరుద్ధమని పేర్కొంది.
– స్వచ్ఛందంగా వ్యభిచారం చేయడం మాత్రం నేరం కాదని తెలిపింది.
– వ్యభిచార గృహాలపై దాడుల సమయంలో స్వచ్ఛందంగా సెక్స్‌ వర్కర్లను అరెస్ట్‌ చేయాలి. కానీ, శిక్షించడం లేదా వేధించడం చేయరాదు.
– ఏ సెక్స్‌ వర్కర్‌ అయినా లైంగికదాడికి గురైతే అందరిలానే వారికి సౌకర్యాలు కల్పించాలి.
– CRPC సెక్షన్‌ 357C ప్రకారం వారికి తక్షణ వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది.
– రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా అన్ని ITPA (ఇమ్మోరల్‌ ట్రాఫికింగ్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌) సంరక్షణ గృహాల్లోనే సర్వే నిర్వహించాలి.
– మహిళలను బలవంతంగా నిర్బంధించినట్లు రుజువైతే.. దానిపై సమీక్షించి నిర్దిష్ట గడువులోగా విడిపించేందుకు చర్యలు తీసుకోవాలి.
– సెక్స్‌ వర్కర్ల పట్ల పోలీసుల వైఖరి క్రూరంగా, హింసాత్మకంగా ఉంటుందని అభిప్రాయపడింది. వారికి హక్కులు ఉంటాయని సూచించింది.
– ఈ విషయంలో పోలీసులు, ఇతర చట్టబద్ధ సంస్థలు సున్నితంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలి.
– మిగతా పౌరులులాగే సెక్స్ వర్కర్లకు రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కులున్నట్లు ఉన్నాయని తప్పక గుర్తించాలి.
– సెక్స్‌ వర్కర్ల ఫొటోలు గానీ, వారి వివరాలు గానీ బహిర్గతంగా వెల్లడించరాదు. ఈ విషయంలో మీడియా జాగ్రత్తలు తీసుకోవాలి.
– దాడులు నిర్వహించిన సమయంలో బాధితులు, నిందితుల ఫొటోలేవీ పబ్లిష్ చేయడం లేదా టెలిక్యాస్ట్ చేయకూడదు.
– కొత్త IPC 354c సెక్షన్‌ కింద ఇతరుల లైంగిక చర్యలను చూడటం నేరం.. ఈ సెక్షన్‌ను ఎలక్ట్రానిక్‌ మీడియాపై కఠినంగా అమలు చేయాలి.
– రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో సెక్స్‌ వర్కర్లు, ఇతరుల ఫొటోలు, వివరాలు టెలిక్యాస్ట్ చేయడం నిషిద్ధమని సుప్రీం సూచించింది.
– సెక్స్‌ వర్కర్లు ఆరోగ్యం, భద్రత దృష్ట్యా కండోమ్‌ వంటివి దగ్గర దొరికినప్పుడు.. వాటి ఆధారంగా నేరంగా పరిగణించరాదు.
– సెక్స్‌ వర్కర్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ, రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థల ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలి.
– హక్కులు, చట్టబద్ధత, పోలీసుల బాధ్యతలు, అధికారాలు, చట్టం ఎలాంటివి అనుమతిస్తోంది? వేటిని నిషేధిస్తోంది అనే విషయాలపై అవగాహన కల్పించాలి.
– హక్కుల కోసం అవసరమైతే న్యాయవ్యవస్థను ఎలా వినియోగించుకోవచ్చో తప్పకుండా చెప్పాలి.
– మానవ అక్రమ రవాణా చేసేవారు, పోలీసుల చేతుల్లో వేధింపుల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో వివరించాలి.
– UIDAI జారీచేసే ప్రొఫార్మా సర్టిఫికెట్‌ను ఆధారంగా సెక్స్‌ వర్కర్లందరికీ ఆధార్‌కార్డు జారీచేయాలి.
– వారి వివరాలను నమోదు చేసే సమయంలో ఎక్కడా కూడా సెక్స్‌వర్కర్‌గా ప్రస్తావించకూడదు.

Read Also : Police Jobs : తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే ఆఖరు