Prithvi Shaw : రూల్ ఈజ్ రూల్.. టీమిండియా యువ క్రికెటర్‌‌ను అడ్డుకున్న పోలీసులు

విశ్వరూపం చూపిస్తున్న కరోనావైరస్ మహమ్మారి కట్టడికి దేశంలోని పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధించగా, మరికొన్ని రాష్ట్రాలు పలు మినహాయింపులు ఇచ్చి ఆంక్షలు అమలుచేస్తున్నాయి. ఈ-పాస్‌లు ఉంటేనే ప్రయాణాలకు అనుమతిస్తున్నాయి. మహారాష్ట్రలో కూడా ఇలాంటి నిబంధనలనే అమలు చేస్తున్నారు. అయితే, ఈ-పాస్ లేకుండా గోవా వెళ్లేందుకు ప్రయత్నించిన టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షాకు చేదు అనుభవం ఎదురైంది.

Prithvi Shaw : రూల్ ఈజ్ రూల్.. టీమిండియా యువ క్రికెటర్‌‌ను అడ్డుకున్న పోలీసులు

Prithvi Shaw

Prithvi Shaw : విశ్వరూపం చూపిస్తున్న కరోనావైరస్ మహమ్మారి కట్టడికి దేశంలోని పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధించగా, మరికొన్ని రాష్ట్రాలు పలు మినహాయింపులు ఇచ్చి ఆంక్షలు అమలుచేస్తున్నాయి. ఈ-పాస్‌లు ఉంటేనే ప్రయాణాలకు అనుమతిస్తున్నాయి. మహారాష్ట్రలో కూడా ఇలాంటి నిబంధనలనే అమలు చేస్తున్నారు. అయితే, ఈ-పాస్ లేకుండా గోవా వెళ్లేందుకు ప్రయత్నించిన టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షాకు చేదు అనుభవం ఎదురైంది.

బయోబుబుల్ లో ఉన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వరుసగా కరోనా బారిన పడటంతో ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లందరూ తమ ఇళ్లకు చేరుకున్నారు. పృథ్వీ షా కూడా ముంబైలోని ఇంటికి చేరుకున్నాడు. అయితే, జూన్ లో న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్ మ్యాచ్‌, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు.

దీంతో గోవాలో వేసవి విడిది చేసేందుకు పృథ్వీ షా తన కారులో బయలుదేరాడు. కాగా, మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో పోలీసులు అతడి కారును అడ్డుకున్నారు. ఈ పాస్ లేదని ప్రయాణానికి అనుమతించ లేదు. అయితే తాను ఈ పాస్ కు అప్లయ్ చేశానని, ఇంకా అనుమతి రాలేదని షా చెప్పాడు. దానికి సంబంధించిన టోకెన్ ను పోలీసులకు చూపాడు. అది చెల్లదని పోలీసులు చెప్పారు. దీంతో షా ఆన్‌లైన్‌లో వెంటనే మరోసారి ఈ పాస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గంట తర్వాత ఈ-పాస్‌ అనుమతి లభించింది. దాన్ని పోలీసులకు చూపించాడు. దీంతో పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. అనంతరం పృథ్వీ షా అక్కడి నుంచి గోవా బయలుదేరాడు.

కాగా, రూల్ ఈజ్ రూల్ అంటున్నారు పోలీసులు. ఈ సమయంలో సామాన్యుడైనా, సెలెబ్రిటీ అయినా రూల్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు. ప్రజల క్షేమం కోసమే ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టాయని, వాటిని అందరూ ఫాలో అవ్వాల్సిందేనని పోలీసులు తేల్చి చెప్పారు.