యుముడికి కరోనా టీకా!

యుముడికి కరోనా టీకా!

policeman’s Yamraj act for COVID vaccine : భారతదేశంలో కరోనా టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. పంపిణీ విషయంలో భారత్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే..కొన్ని కొన్ని ఘటనల కారణంగా..చాలా మంది టీకా వేసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. దీనిపై ప్రజల్లో ఎన్నో సందేహాలున్నాయి. టీకాతో అనారోగ్యం బారిన పడుతామాననే భయం నెలకొంది. కానీ ఎలాంటి భయం అక్కర్లేదని, సురక్షితంగా వేసుకోవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో మార్పు తీసుకరావడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా..మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ కానిస్టేబుల్ వినూత్నంగా వ్యవహరించారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో ఓ కేంద్రంలో కరోనా టీకా పంపిణీ జరుగుతోంది. ఇక్కడకు యుముడి వేషధారణలో ఓ వ్యక్తి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చేతిలో గద, నెత్తిపై కిరీటం, కళ్లకు గ్లాసెస్, వెరైటీ డ్రెస్ ధరించి ఉన్న ఆ వ్యక్తిని చూసి నోరెళ్లబెట్టారు. అసలు విషయం తెలుసుకుని ప్రశంసించారు. అతని పేరు జవహార్ సింగ్. కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. కరోనా టీకాను అందరూ వేయించుకోవాలని తాను ఈ విధంగా చేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఇలాంటి వెరైటీ గెటప్ లు వేశారాయన. గత సంవత్సరం కరోనా సంక్షోభ సమయంలో..యమధర్మరాజు గెటప్ లో సంచరిస్తూ..ప్రజలకు కరోనా నిబంధనలపై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.