Uddhav Thackeray : కాంగ్రెస్,ఎన్సీపీతో రాజకీయంగా విభేదిస్తా..ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

మ‌హారాష్ట్ర‌లో అధికార శివ‌సేన‌-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమిలో విభేదాలు నెల‌కొన్నాయ‌ని..త్వరలో శివసేన-బీజేపీ చేతులు కలుపుతాయని ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో మంగళవారం సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Uddhav Thackeray : కాంగ్రెస్,ఎన్సీపీతో రాజకీయంగా విభేదిస్తా..ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

Uddav

Uddhav Thackeray మ‌హారాష్ట్ర‌లో అధికార శివ‌సేన‌-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమిలో విభేదాలు నెల‌కొన్నాయ‌ని..త్వరలో శివసేన-బీజేపీ చేతులు కలుపుతాయని ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో మంగళవారం సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మహా వికాస్ అఘాడీ(MVA) ప్రభుత్వంలో త‌మ భాగ‌స్వామ్య ప‌క్షాలైన ఎన్సీపీ, కాంగ్రెస్‌ల‌తో తాను రాజ‌కీయంగా విభేదిస్తాన‌ని అన్నారు. ఆ పార్టీల‌కు రాజ‌కీయంగా తాను వ్య‌తిరేక‌మే అయినా ప్ర‌భుత్వంలో వారు చేసే మంచిప‌నుల‌ను త‌ప్పులుగా ఎంచ‌బోన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న తండ్రి బాలాసాహెబ్ లేదా తాను ఇలాంటి ప‌నులు ఎన్న‌డూ చేయ‌బోమ‌ని అన్నారు. మ‌హారాష్ట్ర‌లో సంకీర్ణ భాగ‌స్వాముల మ‌ధ్య విభేదాలు ముదిరాయ‌నే వార్త‌ల నేప‌థ్యంలో ఠాక్రే వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

కాగా త‌న క‌ద‌లిక‌ల‌పై శివసేన‌, ఎన్సీపీలు నిఘా పెడుతున్నాయ‌ని సోమవారం మ‌హారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా ప‌టోలె లోనోవాలో మద్దతుదారులనుద్దేశించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య‌లు ఏంవీఏ స‌ర్కార్‌లో క‌ల‌క‌లం రేపాయి. సీఎం ఉద్దవ్ ఠాక్రే,డిప్యూటీ సీఎం అజిత్ పవార్,హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ లు..రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మీటింగ్ లకు సంబంధించిన రిపోర్ట్ లను ప్రతి రోజూ ఉదయం 8గంటలకు తెప్పించుకొని చూస్తారని నానా పటోలె తెలిపారు. ఇక, వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగా బ‌రిలో దిగుతుంద‌ని ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న సంకీర్ణ స‌ర్కార్‌లో లుక‌లుక‌ల‌ను బ‌య‌ట‌పెట్టింది.