ఈసీ,ఐటీ నన్ను,నా కుటుంబాన్ని వేధిస్తోంది

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 02:31 PM IST
ఈసీ,ఐటీ నన్ను,నా కుటుంబాన్ని వేధిస్తోంది

 ఎలక్షన్ కమిషన్,ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తనను,తన కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపించారు కర్ణాటక సీఎం కుమారస్వామి.గడిచిన రెండు రోజుల్లో 14సార్లు తన కారుని అధికారులు తనిఖీ చేశారని కుమారస్వామి అన్నారు.గురువారం 60కిలోమీటర్ల  దూరంలో ఉండే గోఖర్ణ,కార్వార్ మధ్యలో రెండుసార్లు తన కారుని తనిఖీ చేశారని అన్నారు.తన కుమారుడు, జేడీఎస్ మండ్యా అభ్యర్థి నిఖిల్ ను కూడా ఇలాగే వేధిస్తున్నారన్నారు.తమ వాహనాలు చెక్ చేయాలని ఎలక్షన్ కమిషన్ పోలీసులపై ఒత్తిడి తెస్తోందన్నారు.ఎలక్షన్ కమిషన్  అధికారులు వారి డ్యూటీ వారు చేయడంలో ఇబ్బంది లేదని..కానీ వట్టి అనుమానంతో తమను వేధించకూడదని అన్నారు.

అంతేకాకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత రికార్డు స్థాయిలో అధికారులను ట్రాన్స్ఫర్ చేశారన్నారు.కర్ణాటక చరిత్రలో ఏ ఎలక్షన్ సమయంలో కూడా ఇంతమంది అధికారుల బదిలీ జరుగలేదన్నారు.ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు పరిపాలనపై తాను గ్రిప్ కోల్పోయేలా చేసినట్లు కుమారస్వామి తెలిపారు.కర్ణాటకలో ఏప్రిల్-18,23న లోక్ సభ ఎన్నికలు రెండు విడతల్లో జరుగనున్నాయి.