ఎన్నికల అధికారి అర్నబ్ రాయ్ మిస్సింగ్

  • Published By: madhu ,Published On : April 19, 2019 / 08:17 AM IST
ఎన్నికల అధికారి అర్నబ్ రాయ్ మిస్సింగ్

పశ్చిమబెంగాల్ నదియా జిల్లాలో ఎన్నికల అధికారి అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. అతని ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా ? లేక ఎక్కడికైనా వెళ్లాడా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అర్నబ్ రాయ్‌ కారు డ్రైవర్‌ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన ఏప్రిల్ 18వ తేదీ గురువారం జరిగింది. 

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌‌లోని 3 లోక్ సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. నదియా జిల్లాలో అర్నబ్ రాయ్ నోడల్ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. ఇతను EVM’s, VVPATలకు ఇన్‌ఛార్జీగా ఉన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా విప్రదాస్ చౌదరి పాలిటెక్నిక్ కాలేజీలో గురువారం విధులకు హాజరయ్యాడు. అనంతరం లంచ్‌కి వెళ్లిన అర్నాబ్ తిరిగి విధులకు హాజరు కాలేదు. దీంతో తోటి సిబ్బంది పలు ప్రాంతాల్లో వెతికారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఎన్నికల్లో చెదురుముదురు ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.