పోలింగ్ డే : జార్ఖండ్ నాలుగో విడత ఎన్నికలు

  • Published By: madhu ,Published On : December 16, 2019 / 02:33 AM IST
పోలింగ్ డే : జార్ఖండ్ నాలుగో విడత ఎన్నికలు

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ స్టార్ట్ అయ్యింది. 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 15 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 221 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 23 మంది మహిళలు. మొత్తం 47 లక్షల 85 వేల 009 ఓటర్లున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. కానీ..భద్రతా కారణాల మధ్య..జమువా, బోడర్, తుండి, దుమ్రి, గిరిధ్ స్థానాల్లో సాయంత్రం 3గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 

మొత్తం 81 సీట్లున్నాయి. 
మొదటి మూడు విడతల్లో 50 స్థానాలకు పోలింగ్ ముగిసింది. 
నాలుగో విడత ఎన్నికల్లో 15 సీట్లకు ఎన్నికలు పూర్తవుతాయి. 
డిసెంబర్ 20న చివరి దశ పోలింగ్ (16 సీట్లకు) జరుగనుంది. 
ఫలితాలు డిసెంబర్ 23న. 

– బరిలో ఉన్న ప్రముఖులు
జార్ఖండ్ కార్మిక శాఖ మంత్రి రాజ్ పాలివార్, రెవెన్యూ శాఖ మంత్రి అమర్ కుమార్ బౌరి
మధుపర్ స్థానం నుంచి పాలివార్ జేఎంఎం అభ్యర్థి హుస్సేన్ అన్సారీ
అమర్ కుమార్ బౌరి ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన ఏజేఎస్‌యూ ఉమాకాంత్ రజాక్
జరియా నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ సతీమణి రజిని సింగ్ పోటీ
జరియా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి దివంగత నీరజ్ సింగ్ సతీమణి పూర్ణిమ
నీరజ్ సింగ్ హత్య కేసులో ఆరోపణలతో ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. 

Read More : డెడ్ లైన్ : ఆధార్ – పాన్ లింక్ తప్పనిసరి